వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది, మరోవైపు ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

Unsplash

By Anand Sai
Jul 25, 2024

Hindustan Times
Telugu

ఈ వర్షాకాలంలో స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. వర్షాల సమయంలో వాతావరణంలో తేమతో చర్మంపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలను సులభంగా పెంచుతుంది.

Unsplash

మీరు వర్షాకాలంలో తడి బట్టలు ధరించినప్పుడు, చర్మంపై తేమను నిలుపుకుంటుంది. ఇది సమస్యలకు కారణమవుతుంది.

Unsplash

వర్షాకాలంలో ఫుట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఇది పాదాలకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. వేళ్ల మధ్య జరుగుతుంది. పాదాలు ఎక్కువసేపు తడిగా ఉన్నపుడు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది.

Unsplash

ఫంగల్ ఇన్ఫెక్షన్ చర్మంపై ఎరుపు, దురద పాచెస్‌కు కారణమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. దీనిని రింగ్ వార్మ్ అని కూడా అంటారు.

Unsplash

చర్మంపై వృత్తాకార మచ్చలు కనిపిస్తాయి, ఇవి నెమ్మదిగా పెరుగుతాయి. ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వర్షాకాలంలో తడి, మురికి బట్టలు ధరించడం ప్రమాదాన్ని పెంచుతుంది.

Unsplash

ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇది సాధారణంగా చంకలు, గజ్జలు, మహిళల ప్రైవేట్ భాగాలలో తేమగా ఉండే ప్రదేశాలలో సంభవిస్తుంది.

Unsplash

వర్షాకాలంలో తేమశాతం పెరగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రభావిత ప్రాంతంలో దురద, మంట కలిగిస్తుంది.

Unsplash

పసుపు వాటర్ ఎందుకు తాగాలి...? ఈ కారణాలు తెలుసుకోండి

image credit to unsplash