లవంగాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసు. అయితే వాటితో మీరు ఊహించని మరో 7 లాభాలు కూడా ఉన్నాయని తెలుసా?

Pixabay

By Hari Prasad S
Mar 13, 2025

Hindustan Times
Telugu

లవంగాల నూనె, నీళ్లు కలిపితే మంచి రూమ్ ఫ్రెష్‌నర్ అవుతుంది. గదిలో ఎలాంటి కెమికల్స్ లేకుండా గాలి శుభ్రం కావాలంటే ఇది అత్యుత్తమ మార్గం

Pixabay

బద్ధకంగానో, అలసటగానో అనిపిస్తుందా? లవంగాల నూనె ఒక చుక్కను టీ, కాఫీ లేదా ఏదైనా పానీయంలో వేసుకొని తాగి చూడండి. హుషారుగా మారతారు

Pixahive

టీ కోసం ఉపయోగించే ఫ్లాస్క్‌లు కొన్నాళ్లు వాసనగా అనిపిస్తాయి. వీటిని కడిగిన వెంటనే కొన్ని లవంగాలు అందులో వేసి ఉంచండి. మ్యాజిక్ చూడండి.

Pixahive

మెరిసే చర్మం కోసం కూడా లవంగాల నూనెను ఉపయోగించవచ్చు. చాలా తక్కువ మొత్తంలో ఈ నూనెను చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

Pixahive

కిచెన్‌లో దుర్వాసన వస్తుంటే నీళ్లలో లవంగాలు వేసి ఉంచండి. ఆ నీళ్లు మెల్లగా ఆవిరైపోతుంటే ఆ వాసన పూర్తిగా తొలగిపోతుంది

Pixahive

లవంగాలను రోజూ నమిలితే హైపర్‌టెన్షన్ తగ్గుతుందన్న విషయం తెలుసా? కొన్ని రోజుల పాటు ప్రయత్నించి చూడండి

Pixabay

ఇంట్లో క్రిమికీటకాలు ఉంటే వాటిని పారదోలడానికి రసాయనాల బదులు ఓ లవంగాల మొక్కను పెంచుకోవడం మంచిది

Pixabay

ఈ 6 చిట్కాలతో ఏ వయసులోనైనా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుకోండి!

Photo Credit: Pinterest