చలికాలంలో దాల్చిన చెక్కతో లాభాలు ఇవే.. తప్పక తీసుకోండి!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Dec 06, 2024
Hindustan Times Telugu
దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగకరం. అందుకే దాల్చిన చెక్కను రెగ్యులర్‌గా తీసుకోవాలి. చలికాలంలో దాల్చిన చెక్కతో లాభాలు ఏవంటే..
Photo: Pexels
శరీరానికి దాల్చిన చెక్క వెచ్చదనాన్ని అందించగలదు. శీతాకాలంలో చలి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దాల్చిన చెక్కను నానబెట్టి నీరు తాగొచ్చు, టీ చేసుకోవచ్చు. వంటకాల్లోనూ వేసుకొని తీసుకోవచ్చు.
Photo: Pexels
చలికాలంలో వాతావరణం వల్ల బద్ధకంగా అనిపిస్తుంది. అయిత, దాల్చిన చెక్క.. శరీరంలో చురుకు దనాన్ని పెంచగలదు. మూడ్‍ను యాక్టివ్ చేస్తుంది. రక్త ప్రసరణను కూడా చెక్క మెరుగుపరుస్తుంది.
Photo: Pexels
జీర్ణవ్యవస్థకు కూడా దాల్చిన చెక్క మేలు చేస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేయగలదు. చలికాలంలో చాలా మందికి జీర్ణం ఇబ్బందిగా ఉంటుంది. వారికి దాల్చిన చెక్క చాలా ఉపయోగపడుతుంది.
Photo: Freepik
దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి. దీంతో ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని దాల్చిన చెక్క తగ్గిస్తుంది. వాటి నుంచి ఉపశమనం కలిగించగలదు.
Photo: Pexels
బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారికి దాల్చిన చెక్క ఎంతో ఉపకరిస్తుంది. ఆకలిని ఇది తగ్గించగలదు. క్యాలరీలు ఎక్కువగా తీసుకుండా సహకరిస్తుంది.
Photo: Pexels
దాల్చిన చెక్కను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీటిని తాగొచ్చు. దాల్చిన చెక్క పొడిని మరిగించి టీ చేసుకోవచ్చు. రుచి కోసం తేనె యాడ్ చేసుకోవచ్చు. వంటకాల్లోనూ దాల్చిన చెక్కను వాడొచ్చు.