డయాబెటిస్ ఉన్న వారికి దాల్చిన చెక్క మేలు చేస్తుందా.. ఎలా తీసుకోవచ్చు?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 06, 2025

Hindustan Times
Telugu

దాల్చిన చెక్కలో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఇది వాడడం ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. డయాబెటిస్ ఉన్న వారికి కూడా దాల్చిన చెక్క వల్ల లాభాలు ఉంటాయి. 

Photo: Pexels

దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సివిటీ పెరుగుతుంది. ఇన్సులిన్ పని తీరు మెరుగవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు ఇది చాలా కీలకం. 

Photo: Pexels

ఆహారం తిన్న వెంటనే బ్లడ్ షుగర్ అమాంతం పెరిగిపోకుండా దాల్చిన చెక్క నియంత్రించగలదు. 

Photo: Pexels

డయాబెటిస్ ఉన్న వారికి గుండె వ్యాధుల వచ్చే రిస్కును దాల్చిన చెక్క తగ్గించగలదు. కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ తగ్గేలా తోడ్పడగలదు. దీంతో గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

Photo: Pexels

దాల్చిన చెక్కను వివిధ రకాలుగా తీసుకొవచ్చు. నీటిలో దాల్చిన చెక్కను మరగబెట్టి.. ఆ నీటిలో నిమ్మరసం, తేనె లాంటివి కలుపుకోవచ్చు. ఇలా టీ చేసుకొని తాగొచ్చు. 

Photo: Pexels

దాల్చిన చెక్కను బ్లాక్ టీ, సాధారణ టీ, పాలల్లోనూ కలుపుకొని తీసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్న వారు రోజులో గరిష్టంగా 6 గ్రాముల వరకే దాల్చిన చెక్కను తీసుకోవాలి. అంతకు మించి తీసుకోకూడదు. 

Photo: Pexels

డయాబెటిస్ ఉన్న వారు సంబంధిత వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూనే ఉండాలి. అదనంగా కొన్న జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలి. ఏమైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను అడిగి తెలుసుకోవాలి.

Photo: Pexels

స్పెర్మ్​ కౌంట్​ని అమాంతం తగ్గించే ఫుడ్స్​ ఇవి- జాగ్రత్తగా ఉండాలి!

pixabay