మెుక్కజొన్న పీచును చాలా మంది తీసి పడేస్తారు. కానీ దీనితో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Unsplash
By Anand Sai Feb 25, 2024
Hindustan Times Telugu
మొక్కజొన్న గింజలను తింటాం.. కానీ వాటి చుట్టూ ఉన్న పీచును నిర్లక్ష్యంగా పడేస్తాం. మెుక్కజొన్న పీచు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
Unsplash
అధిక కొలెస్ట్రాల్ పెద్ద సమస్యగా మారింది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కార్న్ సిల్క్ తీసుకోవడం వల్ల రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
Unsplash
మధుమేహంతో బాధపడేవారికి మొక్కజొన్న పీచు ఒక వరం. వీటిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సంపూర్ణంగా నియంత్రిస్తుంది.
Unsplash
బలమైన రోగనిరోధక వ్యవస్థ వ్యాధుల సంక్రమణను నివారిస్తుంది. మొక్కజొన్న పీచులో విటమిన్ సి ఉండటం వల్ల దీని వినియోగం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Unsplash
కడుపు సమస్యలతో బాధపడేవారు మొక్కజొన్న పీచును తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది.
Unsplash
గర్భిణులు మొక్కజొన్న పీచును తీసుకోవాలి. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వారికి ఉపయోగపడుతుంది.
Unsplash
మొక్కజొన్న పీచుతో టీ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కిడ్నీలోని హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. కిడ్నీలో రాళ్లు రాకుండా చూసుకోవచ్చు.
Unsplash
ఏపీ డీఈఈసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే