చింత చిగురుతో కీళ్ల వాపులు తగ్గడం ఖాయం

By Haritha Chappa
May 10, 2024

Hindustan Times
Telugu

చింత చిగురు ఎక్కువగా దొరికే సీజన్ ఇదే. చింతచిగురును వీలైనంతగా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

పుల్లపుల్లగా ఉండే చింత చిగురును పప్పులో వేసుకుంటే రుచిగా ఉంటుంది. అలాగే చింత చిగురు రైస్ చేసుకున్నా బావుంటుంది. 

చింతచిగురు తినడం వల్ల వైరస్, బ్యాక్టిరియాతో పోరాడే శక్తి శరీరానికి వస్తుంది. 

 వైరల్ జ్వరాలు లేకుండా అడ్డుకునే శక్తి ఈ ఆకుకూరకు ఉంది.

 గుండె జబ్బులు రాకుండా ఉండాలన్నా, పొట్టలో నులిపురుగుల సమస్య తగ్గాలన్నా చింత చిగురును తరచూ తింటూ ఉండాలి.

చింతచిగురును తినడమే కావు, వాటిని దంచి ముద్దలా చేసి కీళ్లపై పెట్టుకున్నా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 

 థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ చింత చిగురును తినాలి. 

డయాబెటిస్ తో బాధపడేవారు చింత చిగురును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 

రాగులు ఎందుకు తినాలి..? ఈ విషయాలను తెలుసుకోండి