పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు ఆకలిని కోల్పోతారు. అనారోగ్యంతో లేకపోయినా పిల్లలు ఆహారం తినడానికి నిరాకరిస్తుంటారు. భోజనాన్ని ఎగ్గొట్టేందుకు సాకులు చెబుతుంటారు. పిల్లల ఆకలిని ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.  

unsplash

By Bandaru Satyaprasad
Dec 02, 2023

Hindustan Times
Telugu

 పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు తరచుగా ఆకలిని కోల్పోతారు.  దీంతో పాటు ఆందోళన, ఒత్తిడి, పెరుగుదల కాలంలో ఆకలి తగ్గడం, ఆహార అలెర్జీలు లేదా జీర్ణ సమస్యలు, పిల్లల రుచి ప్రాధాన్యతలు కారణం కావొచ్చు. 

unsplash

పిల్లల్లో తక్కువ ఆకలికి కారణం  

unsplash

వివిధ రకాల ఆహారాలను అందించండి

unsplash

పిల్లల్లో భోజనం పట్ల ఆసక్తి పెంచేందుకు విభిన్న పోషకాహారాలను అందించండి.  

unsplash

టిఫెన్, మధ్యాహ్న భోజనం, స్నాక్స్, డిన్నర్ వీటన్నింటినీ షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించండి.   

unsplash

రెగ్యులర్ భోజన షెడ్యూల్‌  

unsplash

కుటుంబ సభ్యులతో భోజనాన్ని ప్రోత్సహించండి 

unsplash

కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడాన్ని పిల్లలకు నేర్పండి. కలిసి తినడం వల్ల పిల్లల్లో భోజనం పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.  

unsplash

పిల్లలు భోజనం చేసేటప్పుడు వారికి ఆహ్లాదం కలిగించేలా మాట్లాడడం, ఉత్సాహపరచడం చేయాలి.   

unsplash

ఆహ్లాదకరమైన ఆహార వాతావరణం   

unsplash

రోల్ మోడల్ గా ఉండండి 

unsplash

పిల్లలు తరచుగా వారి తల్లిదండ్రుల ఆహారపు అలవాట్లను అనుకరిస్తారు. కాబట్టి మీరు క్రమం తప్పకుండా పోషక ఆహారం తీసుకోవడం మంచిది.  

unsplash

టీవీ చూస్తూ తింటున్నారా? ఈ అలవాటును మాన్పించండి. ఎందుకంటే భోజన సమయంలో టీవీ, ఫోన్ లు చూడడం తగ్గించి మీ పిల్లలు ఆహారంపై దృష్టి పెట్టేటట్లు చేయండి.   

unsplash

టీవీ, ఫోన్ చూడడాన్ని పరిమితం చేయండి

unsplash

మితిమీరిన స్నాక్స్ మానుకోండి 

unsplash

లంచ్, డిన్నర్ మధ్య స్నాక్స్ తినడం మంచిది. చాలా స్నాక్స్ పిల్లల ఆకలిని పాడు చేస్తాయి.  

unsplash

ఆహారం తయారీలో పిల్లలను భాగస్వామ్యం చేయడం వల్ల వారికి ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది.  

unsplash

పిల్లలతో కలిసి వంట చేయండి 

unsplash

పిల్లల ప్రాధాన్యతలను గౌరవించండి 

unsplash

మీ పిల్లలు పోషకాలతో నిండిన ఆహారాన్ని తినాలని కోరుకుంటారు. అన్ని ఆహారాలను తినమని వారిని బలవంతం చేయకండి. ఆహారం విషయంలో వారి ఇష్టాలు గౌరవించాలి. 

unsplash

ఉదయం త్వరగా నిద్ర లేచేందుకు ఐదు టిప్స్

Photo: Pexels