పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచడానికి పౌష్టికాహారం అవసరం. కొన్ని రకాల ఆహారాలు మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో పిల్లలకు ఈ ఆహారాలు పెడితే ఎన్నో లాభాలు ఉంటాయి.     

pexels

By Bandaru Satyaprasad
Jan 11, 2025

Hindustan Times
Telugu

 బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, టమాటాలు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  

pexels

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు...సాల్మన్, ట్యూనా,మాకేరెల్ పిల్లల బ్రెయిన్ పెరుగుదలకు ఉపయోగపడతాయి.  

pexels

కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే బత్తాయి, గోధుమలు, బ్రౌన్ రైస్....శరీరానికి శక్తిని అందించడమే కాకుండా మెదడుకు శక్తిని అందిస్తాయి.  

pexels

గుడ్డులోని కోలిన్ అనే పోషకం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 

pexels

విటమిన్లు , మినరల్స్ పుష్కలంగా ఉండే పాలకూర, బ్రకోలి, మెంతులు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఆకు కూరల్లో విటమిన్ ఎ, కె, ఫోలేట్‌తో సహా మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.   

pexels

బాదం, వాల్‌నట్స్, పిస్తా మెదడు పనితీరుకు అవసరమయ్యే  కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు అందిస్తాయి. నట్స్ లో విటమిన్ ఈ,  ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.   

pexels

బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మెదడు కణాలకు నష్టం కలగకుండా రక్షిస్తుంది. 

pexels

ఓట్స్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఓట్స్ పిల్లలను రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచేందుకు సహాయపడతుంది.  

pexels

 క్వినోవాలోని కోలిన్  న్యూరోట్రాన్స్మిషన్‌, మెంటల్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. ఇది పిల్లలకు స్థిరమైన శక్తిని అందిస్తుంది.

pexels

పిల్లలకు ఆకలిగా ఉండటం లేదా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash