కావల్సినవి:
ఉల్లిపాయల తరుగు - అర కప్పు,
ఉప్పు - ఒక టీస్పూన్
ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - ఒక స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయించడానికి సరిపడా
గుడ్డు - ఒకటి
మిరియాల పొడి - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
వెల్లుల్లి రెబ్బలు - అయిదు
కార్న్ ఫ్లోర్ - ఒక స్పూను
చిల్లీ సాస్ - ఒక టీ స్పూను
టమోటా సాస్ - అర స్పూను
సోయా సాస్ - అర స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
గరం మసాలా పొడి - అర స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, కోడిగుడ్డు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి.
అరగంట పాటూ అలా మారినేట్ చేసి వదిలేయాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి చికెన్ ముక్కలను వేసి వేయించుకోవాలి. అవి ఎర్రగా మారాక తీసి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ మీద కళాయి పెట్టి వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు వేసి వేయించాలి. అందులోనే సోయాసాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ వంటివి వేసి బాగా కలపాలి.
రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.
పైన కొత్తిమీర తరుగును చల్లుకుంటే సరి. టేస్టీ చికెన్ 65 రెడీ అయినట్టే.
ఈ 5 సంకేతాలు రక్తంలో అధిక చక్కెరను సూచిస్తాయి, జాగ్రత్త!