మనం ప్రతిరోజూ తినే ఆహారం మన మెదడు వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచే, మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహారాలను తినాలని అంటారు.

Unsplash

By Anand Sai
Apr 24, 2025

Hindustan Times
Telugu

ఓట్స్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వినియోగం మెదడుకు చాలా శక్తిని అందిస్తుంది. ఉదయంపూట వీటిని తీసుకోవాలి.

Unsplash

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాడో చాలా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Unsplash

వాల్‌నట్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవి నాడీ వ్యవస్థకు సహాయం చేయడం ద్వారా జ్ఞాపకశక్తిని బలపరుస్తాయి. ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

Unsplash

బ్లూబెర్రీలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. ఇది దీర్ఘకాలంలో మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Unsplash

చియా విత్తనాలు చాలా పోషక శక్తితో నిండి ఉంటాయి. ఇందులోని ఒమేగా-3 ఆమ్లాలు, ఫైబర్ కంటెంట్ మెదడుకు శక్తిని అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.

Unsplash

గుమ్మడికాయ గింజలలో జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

Unsplash

పాలకూరలోని విటమిన్ కె, ఫోలేట్ వంటి పోషకాలు మెదడుకు చాలా అవసరం. ఇవి మెదడు కణాల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Unsplash

మ్యాక్సీ డ్రెస్‍లో ప్రగ్యా జైస్వాల్ హాట్ షో.. అదిరే పోజులు

Photo: Instagram