రాత్రి భోజనం తరువాత యాలకులు నమిలితే వచ్చే మేలు ఎంతో
By Haritha Chappa Mar 18, 2025
Hindustan Times Telugu
యాలకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత యాలకులు నమలడం వల్ల శరీరంలో అనేక మార్పులు, ప్రయోజనాలు కలుగుతాయి.
యాలకులు విటమిన్ సి, బి 6, బి 3 వంటి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, ఫైబర్ లతో నిండి ఉంటాయి.
యాలకులు జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తాయి. ఇది ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఉదర సంబంధ సమస్యలకు నేచురల్ మెడిసిన్ గా పనిచేస్తుంది.
యాలకులు జీవక్రియను ప్రోత్సహిస్తుంది. కేలరీల బర్నింగ్ ను మెరుగుపరుస్తుంది. శరీరంలో కొవ్వులు పేరుకుపోకుండా నిరోధించడం ద్వారా శరీర బరువును నియంత్రిస్తుంది.
యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది. నేచురల్ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది.
ఇది శరీరం నుండి శ్లేష్మాన్ని బయటకు పంపుతుంది. గొంతు నొప్పిని ఉపశమనం చేస్తుంది. ఇది శ్వాస సజావుగా సాగడానికి సహాయపడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
ఉదర ప్రాంతంలోని ఆమ్లాన్ని తటస్తం చేయడం ద్వారా, ఇది ఎసిడిటీ, గుండెల్లో మంట , అజీర్ణాన్ని నివారిస్తుంది
నరాలను సడలించడం ద్వారా, ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!