చలికాలంలో రోజూ యాలకులు పచ్చిగా నమలండి.. ఈ 5 లాభాలు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Nov 29, 2024

Hindustan Times
Telugu

యాలకుల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. అందుకే శీతాకాలంలో తొక్కతీసి పచ్చి యాలకులను నేరుగా నమలాలి. చలికాలంలో రోజూ రెండు పచ్చి యాలకులను చప్పరిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి. 

దగ్గు, జలుబు లాంటి శ్వాసకోశ సమస్యలు తగ్గేందుకు యాలకులు సహకరిస్తాయి. పచ్చి యాలకులు నమితిలే వీటి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని తగ్గించే యాంటీఇన్‍ఫ్లమేటరి సహా మరిన్ని గుణాలు యాలకుల్లో ఉంటాయి. 

Photo: Pexels

చలికాలంలో జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. వాటిని యాలకులు తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థలో ఎంజైమ్‍ల ఉత్పత్తిని యాలకులు ప్రేరేపిస్తాయి. అందుకే యాలకులు తింటే జీర్ణ సమస్యలు తగ్గేందుకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

యాలకులు తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల రిస్క్ ఎక్కువగా ఉండే చలికాలంలో ఇది చాలా మేలు చేస్తుంది. రోగ కారకాలతో శరీరం దీటుగా పోరాడేలా యాలకులు సహకరిస్తాయి.

Photo: Pexels

శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి పోయేలా యాలకులు సహకరిస్తాయి. కాలేయం పని తీరును ఇవి మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యను కూడా తగ్గించగలవు. 

Photo: Freepik

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేలా కూడా యాలకులు తోడ్పడతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనాన్ని కలిగించగలవు. 

Photo: Pexels

యాలకులను పచ్చిగా తినవచ్చు. లేకపోతే నీళ్లలో మరిగించుకొని తాగవచ్చు. యాలకులతో టీ కూడా చేసుకోవచ్చు. బరువు తగ్గేందుకు కూడా యాలకులు తోడ్పడతాయి. 

Photo: Freepik

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.

pixabay