చెర్రీస్ రుచికరమైనవి మాత్రమే కాదు వీటిలో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. చెర్రీస్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Jun 17, 2024

Hindustan Times
Telugu

యాంటీ ఆక్సిడెంట్లు - టార్ట్ చెర్రీస్ లో ఆంథోసైనిన్స్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, కాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  

pexels

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు - చెర్రీస్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను అందిస్తాయి. ఇది ఆర్థరైటిస్ తో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.  

pexels

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది - చెర్రీస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి.  

pexels

మెరుగైన నిద్ర - చెర్రీస్ లోని టార్ట్ రకాలు నిద్రను నియంత్రించే హార్మోన్ మెలటోనిన్ ను కలిగి ఉంటాయి. చెర్రీస్ నిద్ర వ్యవధి, నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  

pexels

బరువు తగ్గడం - చెర్రీస్ లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి బరువు నిర్వహణకు సహాయపడతాయి. ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రిస్తుంది.  

pexels

రోగ నిరోధక వ్యవస్థను పెరుగుపరుస్తుంది 

pexels

చెర్రీస్ లో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణగా ఉంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.  

pexels

లక్ష్మీదేవికి  ఈ పూలతో పూజ చేస్తే మీ ఇంట సిరుల పంట 

pinterest