వాము లేదా క్యారమ్ గింజలు భారతీయ సంప్రదాయ వైద్యంలో ప్రధానమైనవి. ప్రతి ఇంటి వంటగదిలో ఇవి కనిపిస్తాయి. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిగిన వాముతో 7 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Feb 10, 2025
Hindustan Times Telugu
జీర్ణక్రియకు మంచిది - మీకు తరచుగా కడుపు నొప్పి, తిమ్మిరి లేదా అజీర్ణం వంటి గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వాముతో మీకు ఉపశమనం కలిగిస్తాయి. వాములోని థైమోల్ అనే సమ్మేళనం గ్యాస్ట్రిక్ రసాల స్రావాన్ని పెంచుతుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ తగ్గించి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది .
pexels
రక్తపోటును తగ్గిస్తుంది- అధిక రక్తపోటు స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. వాము రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. క్యారమ్ విత్తనాలలోని థైమోల్ వంటి సహజ సమ్మేళనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
pexels
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది - గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ ఒక ప్రధాన సమస్య. క్యారమ్ సీడ్ సారం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
pexels
దగ్గును తగ్గిస్తుంది- మీరు తరచుగా జలుబు, దగ్గుతో బాధపడుతుంటే వాము వాటర్ సహజ ఇంటి నివారణ. క్యారమ్ గింజలు దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. వాము టీ తాగడం వల్ల దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది.
pexels
బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది- క్యారమ్ విత్తనాలు శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ. కోలి, సాల్మొనెల్లా వంటి హానికరమైన సూక్ష్మజీవులను ఎదుర్కోవడంలో వాము ఉపయోగపడుతుంది.
pexels
పంటి నొప్పి నుంచి ఉపశమనం- పంటి నొప్పి లేదా చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఉన్నవారికి వాము గింజలు సహజ నివారణగా పనిచేస్తాయి. వాములో నోటి ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. వాము నమలడం లేదా వాము నూనెను మౌత్ వాష్‌గా ఉపయోగించడం వల్ల అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
pexels
ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది- కీళ్లలో వాపు వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. ఇది నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుంది. వామును వాపును తగ్గించడంలో, ఆర్థరైటిస్‌తో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
pexels
వాము నీరు : ఒక టీస్పూన్ వాము గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
వాము పొడి : అజీర్ణం, దగ్గు, గొంతు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వాము గింజలను పొడిగా చేసి, గోరువెచ్చని నీరు లేదా తేనెతో కలిపి తాగండి.