రాత్రి పడుకున్న తర్వాత తరచుగా మూత్ర విసర్జన చేయడం ఆరోగ్య సమస్యకు సంకేతం. దీని వెనుక అనేక ఇతర కారణాలు ఉండవచ్చు, విస్మరించకూడదు.
Unsplash
By Anand Sai Jun 23, 2025
Hindustan Times Telugu
ప్రతిరోజూ నిద్రలో పదే పదే మూత్ర విసర్జన చేయడం వంటి సమస్య ఉంటే.. ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని అర్థం.
Unsplash
ఒక వ్యక్తి రాత్రిపూట రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడానికి మేల్కొంటే, ఇవి మూత్రపిండాల వ్యాధి లక్షణాలు కావచ్చు.
Unsplash
మూత్రంలో నురుగు లేదా రక్తం, అలసట, ఆకలి లేకపోవడంలంటి లక్షణాలను విస్మరించకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Unsplash
డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం మూత్రం ద్వారా అదనపు చక్కెరను విసర్జించడానికి ప్రయత్నిస్తుంది. ఇది తరచుగా మూత్రవిసర్జనకు దారితీస్తుంది.
Unsplash
స్త్రీలు, వృద్ధులలో తరచుగా మూత్ర విసర్జనకు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు ప్రధాన కారణం. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పి లేదా దుర్వాసన ఉండవచ్చు.
Unsplash
వృద్ధులైన పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి విస్తరించడం వల్ల రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన జరగవచ్చు. ఒకేసారి కాకుండా తక్కువ మొత్తంలో మూత్ర విసర్జన చేయడం వంటి లక్షణాలు ఉండవచ్చు.
Unsplash
మూత్రవిసర్జనకు కొన్ని మందుల దుష్ప్రభావం కావచ్చు. అలాంటి సందర్భాలలో, వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు తీసుకోవాలి.
Unsplash
క్యాబ్‌లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్‌ని మర్చిపోకండి!