బరువు తగ్గేందుకు క్యారెట్ జ్యూస్‍ను ఇలా టేస్టీగా చేసుకొని తాగండి!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Feb 19, 2025
Hindustan Times Telugu
బరువు తగ్గేందుకు క్యారెట్ బాగా సహకరిస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్ జ్యూస్ తాగడం మంచిది.
Photo: Pexels
కేవలం క్యారెట్లతో చేసే జ్యూస్ అంతగా తాగాలని అనిపించదు. అందుకే రుచికరంగా, మరిన్ని పోషకాలు ఉండేలా క్యారెట్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఎలానో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pexels
క్యారెట్ జ్యూస్ కోసం కావాల్సిన పదార్థాలు: 4 మోస్తరు సైజ్ ఉండే క్యారెట్లు, ఓ యాపిల్, ఓ ఇంచ్ అల్లం, కాస్త ఉప్పు, చిటికెడు మిరియాల పొడి.
ముందుగా క్యారెట్లు, యాపిల్‍ను శుభ్రంగా నీటితో కడగాలి. అల్లం తొక్క తీయాలి. క్యారెట్, యాపిల్, అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
Photo: Pexels
క్యారెట్, యాపిల్, అల్లం ముక్కలను మిక్సీ జ్యూసర్ జార్‌లో వేసుకోవాలి. వాటిని బాగా జ్యూస్ అయ్యేలా బ్లెండ్ చేసుకోవాలి.
Photo: Pexels
ఆ జ్యూస్‍ను ఓ గ్లాసులో పోసుకోవాలి. దానిపై కాసింత ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తాగేయాలి. ఈ జ్యూస్ మంచి రుచిగా ఉంటుంది.
Photo: Pexels
ఈ క్యారెట్ జ్యూస్ రెగ్యులర్‌గా తాగితే బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. యాపిల్, క్యారెట్లలోకీలకమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. పూర్తిస్థాయి ఆరోగ్యానికి కూడా ఈ జ్యూస్ మేలు చేస్తుంది.
Photo: Pexels
ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు