తేనె, నెయ్యి కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదా?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Aug 28, 2024

Hindustan Times
Telugu

తేనె, నెయ్యిల్లో చాలా పోషకాలు ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, తేనె, నెయ్యిని కలిపి తినొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ విషయం ఇక్కడ చూడండి. 

Photo: Unsplash

తేనె, నెయ్యిని సమాన మోతాదులో కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. వీటిని వేర్వేరుగా తింటేనే బాగుటుందని తేల్చాయి. తేనె, నెయ్యిని మిక్స్ చేసుకొని తింటే కొన్ని దుష్ప్రభావాలు కలగొచ్చు. 

Photo: Pexels

తేనె, నెయ్యిని సమాన మోతాదులో కలిపి తీసుకుంటే క్లోస్టిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా వెలువడుతుంది. ఇది శరీరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. 

Photo: Unsplash

నెయ్యి, తేనెను కలిపి తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. పేగులకు ఇబ్బందిగా ఉంటుంది. 

Photo: Pexels

తేనె, నెయ్యిని మిక్స్ చేసుకొని తీసుకుంటే చర్మ సమస్యలు కూడా ఎదురుకావొచ్చు. మొటిమలు, దురద వచ్చే రిస్క్ ఉంటుంది. 

Photo: Pexels

తేనె, నెయ్యిని సమాన మోతాదులో కలుపుకొని తింటే శ్వాసకోశ ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. అయితే, నెయ్యి, తేనెను వేర్వేరుగా రెగ్యులర్‌గా తింటే చాలా మేలు. 

Photo: Pexels

మిల్లెట్స్‌ తింటే ఏమవుతుంది...? వీటిని తెలుసుకోండి

image credit to unsplash