జ్వరంతో ఉన్నప్పుడు చికెన్, గుడ్లు తినవచ్చా?

pixabay

By Haritha Chappa
Jan 09, 2025

Hindustan Times
Telugu

జ్వరం తరచూ వస్తూ పోతూ ఉంటుంది. అయితే ఎంతో మందికి జ్వరంగా ఉన్నప్పుడు ఏం తిన్నాలన్న సందేహం వస్తుంది. 

pixabay

జ్వరం ఉన్నప్పుడు చికెన్, గుడ్లు తినవచ్చా లేదా అనే అనుమానం కూడా ఎక్కువ మందిలో ఉంది. 

pixabay

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినవచ్చు. అయితే తినే పద్దతిని మార్చుకోవాలి. 

pixabay

 చికెన్ లో మసాలాలు, కారాలు దట్టించి తినకూడదు. లేకుండా అది సరిగా అరగక ఇబ్బంది పడతారు. 

pixabay

ముఖ్యంగా చికెన్ సూప్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

pixabay

జ్వరంతో ఉన్నప్పుడు కోడిగుడ్లను తినడం కూడా మంచిదే. గుడ్లు తినకూడదని చెప్పే ఎలాంటి అధ్యయనాలు లేవు.

pixabay

జ్వరం వచ్చినప్పుడు ఉడికించిన గుడ్లను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

pixabay

జ్వరం వచ్చినప్పుడు శరీరానికి కోడిగుడ్లు, చికెన్ తినడం వల్ల శరీరానికి ప్రొటీన్ అధికంగా అందుతుంది. ఇది జ్వరం త్వరగా తగ్గేలా చేస్తుంది. 

pixabay

జ్వరం వచ్చినప్పుడు జీర్ణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి చికెన్, కోడి గుడ్లు మితంగా తినడం మంచిది. 

pixabay

సంక్రాంతి పండుగ రోజు పొరపాటున కూడా ఈ 7 పనులు అస్సలు చేయకండి!