యోగాతో సయాటికా నొప్పి తగ్గుతుందా ..? వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 20, 2025

Hindustan Times
Telugu

సయాటికా అనేది తొడ వెనక భాగంలో ఉండే నరం. కొన్నిసార్లు అతిగా కూర్చోవడం వల్ల ఈ నరం నొప్పిగా ఉంటుంది. దీన్ని సయాటికా నొప్పి అంటారు.

image credit to unsplash

తీవ్రమైన నొప్పి, తిమ్మిరి, జలదరింపు వంటి లక్షణాలు ఉంటాయి ఇది సాధారణంగా శరీరానికి ఒకేవైపున ఉంటుంది.కొన్నిసార్లు రెండువైపులా కూడా రావొచ్చు.

image credit to unsplash

సయాటికా నొప్పిని తగ్గించేందుకు మందులు వాడుతుంటారు. తీవ్రంగా ఉంటే శస్త్ర చికిత్సలు చేస్తారు. అయితే యోగాతో కూడా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

image credit to unsplash

భుజంగాసన : యోగాలో అనేక అసనాలుంటాయి. అయితే సయాటికా నొప్పి ఉన్నవాళ్లు  భుజంగాసన చేస్తుండాలి. బోర్లా పడుకుని అరచేతులని నేలపై పెట్టి నొక్కుతూ అప్పర్ బాడీని పైకి లేపాలి. ఈ ఆసనాన్ని 1 నుంచి 3 సార్లు చేయాలి.

image credit to unsplash

శలభాసన : బోర్లా పడుకోవాలి. మీ అప్పర్ బాడీని నెమ్మదిగా పైకి లేపాలి. ఆ తర్వాత రెండు కాళ్ళని ఒకేసారి లేపడం ద్వారా మీ శరీర బరువు మొత్తం పొట్టపైనే ఉంటుంది. 

image credit to unsplash

అర్థ చంద్రాసన : ముందుగా నిటారుగా నిలబడాలి. తర్వాత కుడివైపుకి తిరిగి కుడి చేతిని నేలకి తాకించాలి. ఈ దశలో ఎడమకాలిని, ఎడమచేతిని పైకి లేపాలి. ఇలా కాసేపు ఉంటే రిలీఫ్ దొరుకుతుంటుంది. 

image credit to unsplash

బాలాసన, సలభాసన వంటి అసనాలతో సయాటికా నొప్పిని తగ్గించుకోవచ్చు. ఒకేసారి శాశ్వత పరిష్కారం కాకుండా నొప్పి క్రమంగా తగ్గుతుంటుంది. ఈ విషయంలో యోగా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవటం మంచిది.

image credit to unsplash

గాయిటర్‌  వ్యాధి లక్షణాలు తెలుసా..? 

image credit to unsplash