స్ట్రాబెర్రీలు నిజంగానే శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయా?
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jan 25, 2025
Hindustan Times Telugu
శృంగార సామర్థ్యం మెరుగ్గా ఉండడంలో తీసుకునే ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని రకాల ఫుడ్స్ ఆ బలాన్ని పెంచుతాయి. స్ట్రాబెర్రీలు కూడా లైంగిక సామర్థ్యాన్ని అధికం చేయగలవా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
Pexels
స్ట్రాబెర్రీలు శృంగార స్టామినాను మెరుగుపరుస్తాయి. ఇవి లైంగిక చర్య మెరుగ్గా చేసేందుకు ఉపకరిస్తాయి. ఎలానో ఇక్కడ చూడండి.
Pexels
స్ట్రాబెర్రీల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. లైంగిక చర్యకు రక్తప్రసరణ బాగుండడం ముఖ్యం. స్ట్రాబెర్రీలు తిడనం వల్ల శృంగార శక్తి మెరుగుపడుతుంది.
Pexels
స్ట్రాబెర్రీల్లో ఉండే మెగ్నిషియం, పొటాషియం లాంటి మినరల్స్.. శృంగార కోరికలను పెంచుతాయి. లైంగిక చర్యకు ఉత్సాహాన్ని కలిగించగలవు.
Pexels
స్ట్రాబెర్రీలు తినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు కూడా తోడ్పతుంది. శృంగార సామర్థ్యం మెరుగ్గా ఉండేందుకు ఇలా కూడా స్ట్రాబెర్రీలు ఉపయోగపడతాయి.
Pexels
స్ట్రాబెర్రీలు తినడం వల్ల శరీరంలో లవ్ హార్మోన్ ‘ఆక్సిటోసిన్’ ఉత్పత్తి మెరుగవుతుంది. ఇది శృంగార వాంఛను అధికం చేస్తుంది.
Pexels
స్ట్రాబెర్రీలను నేరుగా తినొచ్చు. సూత్మీలా చేసుకోవచ్చు. సలాడ్లు, పెరుగులోనూ కలుపుకొని తినొచ్చు. స్ట్రాబెర్రీల్లో ఉండే పోషకాలు పూర్తిస్థాయి ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి.
Pexels
ఖాళీ పొట్టతో గుడ్డు తినకూడదా? తింటే జరిగే నష్టం ఏమిటి?