డయాబెటిస్ ఉన్న వారు ముందుగా ఏం తింటున్నారో గమనించాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి తగిన ఆహారం తీసుకోవాలి. నారింజ, బొప్పాలి, ఆపిల్ తినవచ్చు..అయితే అరటి పండు విషయంలో గందరగోళం వస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్న వారు అరటిపండ్లు తినవచ్చా? వైద్యులు ఏంచెబుతున్నారో తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Mar 26, 2025

Hindustan Times
Telugu

అరటి పండ్లు సహజ చక్కెరలను కలిగి ఉన్నప్పటికీ...ఇవి గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడతాయని వైద్యులు అంటున్నారు.  మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లు తినవచ్చా? అనే ప్రశ్నకు సమాధానం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది మీ HbA1c అంటే గత రెండు, మూడు నెలలుగా రక్తంలో చక్కెర స్థాయి, నియంత్రణపై ఆధారపడి ఉంటుంది. 

pexels

HbA1c ఎక్కువగా ఉంటే మధుమేహాన్ని సరిగ్గా నియంత్రించలేదని సూచిస్తుంది. అలాంటి వారు అరటిపండ్లు పూర్తిగా నివారించడం మంచిది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటే, మీరు చురుకైన జీవనశైలిని అనుసరిస్తే, ఆహారం నియంత్రణ ఉంటే అరటిపండ్లు మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. 

pexels

పండిన అరటిపండ్లు vs పండని అరటిపండ్లు- రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రకు ఏది మంచిది? 

pexels

పండిన అరటిపండ్లు (పసుపు లేదా బాగా పండినవి) - ఇవి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. పండని అరటిపండ్లలో 80-90% కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. అరటి పండు బాగా పండినప్పుడు సాధారణ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్) ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే రక్తంలో చక్కెర స్తాయిలను త్వరగా పెంచుతాయి.   

pexels

పండని అరటిపండ్లు (ఆకుపచ్చ అరటిపండ్లు) - డయాబెటిస్ ఉన్నవారు వారు పండని వాటిని తినవచ్చు. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణకు మంచివి. వీటిలో కార్పొహైడ్రేట్స్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. తక్కువ గ్లైసెమిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇవి పండిన అరటిపండ్ల కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. వీటిని తక్కువ మొత్తంలో తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.   

pexels

కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్నవారికి అరటిపండ్ల ప్రయోజనాలు  

pexels

డయాబెటిస్ కంట్రోల్ లో ఉన్న వారికి, చురుకైన జీవనశైలి ఉన్నవారికి, ఫైబర్ కంటెంట్ ఉన్న అరటిపండ్లు చక్కెర శోషణను నెమ్మదిస్తాయి. పచ్చి అరటిపండ్లలో కార్పొహైడ్రెట్స్ పుష్కలంగా ఉంటుంది. ఇన్సులిన్ సెన్సివిటినీ మెరుగుపరుస్తుంది. పొటాషియం, విటమిన్ B6, విటమిన్ సిలను అందిస్తాయి. అరటిపండ్ల వల్ల ప్రీబయోటిక్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. జీవక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.   

pexels

మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను ఎలా తినాలి? 

pexels

దోరగా ముగ్గిన చిన్న లేదా మధ్య తరహా అరటిపండ్లను మాత్రమే తినండి. పెద్ద వాటిని నివారించండి. రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గాలంటే కొద్దిగా ముగ్గిన అరటిపండ్లను ఎంచుకోండి. జీర్ణక్రియను నెమ్మదింపజేయడానికి ప్రోటీన్ లేదా గింజలు లేదా పెరుగు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో జతచేసి తినండి. మెరుగైన గ్లూకోజ్ వినియోగం కోసం ఉదయం లేదా వ్యాయామానికి ముందు అరటి పండ్లు తినండి. 

pexels

బెస్ట్ బైక్స్ అది కూడా రూ.2 లక్షల లోపు ధరలో..