డయాబెటిస్ ఉంటే చెరకు రసం తాగకూడదా?

Canva

By Haritha Chappa
Mar 20, 2025

Hindustan Times
Telugu

వేసవి వచ్చిందంటే చాలు చెరకు రసం తాగాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది.  అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరకు రసం తాగాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటారు.

Canva

డయాబెటిస్ ఉన్నా చెరకు రసం తాగొచ్చని చాలా మంది అనుకుంటారు. అయితే ఇతర తియ్యని పానీయాల మాదిరిగానే చెరకు రసం కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరమని వైద్యులు చెబుతున్నారు. 

Canva

చెరకు రసం తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. చెరకు రసం తాగడం వల్ల పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు విడుదలవుతాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.

Canva

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటే అప్పుడప్పుడు పావు గ్లాసు చెరకు రసం తాగొచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యకరం కాదు.

Canva

డయాబెటిస్ లేని వారు వేసవిలో చెరకు రసం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో చాలా మంది వడదెబ్బతో బాధపడుతుంటారు. నిర్జలీకరణం కారణంగా ప్రజలు వడదెబ్బకు గురవుతారు. చెరకు రసం తాగితే వడదెబ్బ తగలదు.

Canva

ఎండలో ఉన్నప్పుడు చెరకు రసం రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. 

Canva

ఒక గ్లాసు చెరుకు రసాన్ని రెండు భాగాలుగా చేసుకుని రోజులో రెండు సార్లు తాగితే మంచిది. శరీరానికి రోజంతా రక్షణ లభిస్తుంది.

Canva

మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరకు రసం తాగడానికి పెద్దగా ఆసక్తి చూపకూడదు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది   కాబట్టి  మీకు తాగాలనిపిస్తే పావు గ్లాసు మాత్రమే తాగండి. అది కూడా రోజూ తాగకూడదు.

Canva

ఆ పావు గ్లాసు చెరకు రసం  తాగిన తర్వాత కూడా నిద్రపోకూడదు, విశ్రాంతి తీసుకోకూడదు. ఇంట్లో నడవడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంచుకోవచ్చు.

Canva

నిరాకరణ: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.

Pexels

బెస్ట్ బైక్స్ అది కూడా రూ.2 లక్షల లోపు ధరలో..