డయాబెటిస్ ఉన్న వారు క్వినోవా తినొచ్చా? ప్రభావం ఎలా..

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Dec 10, 2024

Hindustan Times
Telugu

క్వినోవా కొంతకాలంగా బాగా పాపులర్ అవుతోంది. పోషకాలు మెండుగా ఉండే ఈ చిరు ధాన్యం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు క్వినోవా తీసుకోవచ్చా.. ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

డయాబెటిస్ ఉన్న వారు క్వినోవా తొనొచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. బియ్యం బదులు వీటితో అన్నం చేసుకుంటే డయాబెటిస్ ఉన్న వారికి మంచిది. 

Photo: Pexels

క్వినోవాలో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో ఇవి తిన్నా బ్లడ్ షుగర్ అమాంతం పెరగదు. ఇన్సులిన్ సెన్సివినిటీ కూడా ఇది మెరుగుపరచగలదు. 

Photo: Pexels

క్వినోవాలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా షుగర్ కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

క్వినావాలో ప్రోటీన్, అమినో యాసిడ్స్ పుష్కలం. ఇవి శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించి డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేయగలవు. 

Photo: Pexels

క్వినోవాలో ఉండే మెగ్నిషియం.. ఇన్సులిన్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో రక్తంలో చెక్కర స్థాయి అదుపులో ఉండేందుకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

క్వినోవాను ఉడికించుకొని అన్నంలా తినవచ్చు. వీటితో కొన్ని రకాల బ్రేక్‍ఫాస్ట్‌లు చేసుకోవచ్చు. ఇతర చిరుధాన్యాల్లానే క్వినోవాను వండుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా క్వినోవా మంచి చేస్తుంది.

Photo: Pexels

బొప్పాయి, అరటిపండు కలిపి తినడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Unsplash