డయాబెటిస్ ఉన్న వారు దానిమ్మ పండు తినొచ్చా?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Dec 29, 2024

Hindustan Times
Telugu

డయాబెటిస్ ఉన్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. బ్లడ్ షుగర్ పెరగకుండా డైట్ పాటించాలి. పండ్లలో విషయంలోనూ కొన్ని సూచనలు ఫాలో కావాలి. గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి. 

Photo: Pexels

అందుకే డయాబెటిస్ ఉన్న వారు దానిమ్మ పండ్లను తినొచ్చా అనే డౌట్ ఉంటుంది. నేచురల్ షుగర్ ఉండటంతో పండ్ల విషయంలో ఈ సందేహాలు వస్తుంటాయి. మధుమేహం ఉన్న వారు దానిమ్మ తీసుకోవచ్చా అనేది ఇక్కడ తెలుసుకోండి.

Photo: Pixabay

దానిమ్మ పండులో గ్లెసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు ఈ పండును తినొచ్చు. 

Photo: Pexels

నేచురల్ షుగర్ తక్కువగా ఉండే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. అందుకే ఇది తిన్నా శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అమాంతం పెరగవు. దీంతో డయాబెటిస్ ఉన్న వారికి ఈ పండు సూటవుతుంది. 

Photo: Pexels

దానిమ్మలో ఫోలిఫెనాల్స్ సహా మరిన్ని యాంటీఆక్సిడెంట్లు, కీలకమైన పోషకాలు ఉంటాయి. ఈ పండు రెగ్యులర్‌గా తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు కూడా తోడ్పడుతుంది. 

Photo: Pexels

డయాబెటిస్ ఉన్న వారు దానిమ్మను మోస్తరుగానే తినాలి. మరీ అతిగా తినకూడదు. ఎక్కువగా తింటే ఇందులో తక్కువగా ఉండే నేచురల్ షుగర్ కూడా ప్రతికూలంగా మారుతుంది. అందుకే ఓ మోతుదు మేర తినాలి.

Photo: Pexels

డయాబెటిస్ ఉన్న వారు దానిమ్మను జ్యూస్ కంటే పండులాగే తినాలి. జ్యూస్ చేస్తే ఫైబర్ తగ్గి షుగర్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే దానిమ్మ గింజలను నేరుగా తినడం మంచిది. 

Photo: Pexels

బొప్పాయి తిన్నాక  ఈ పని మాత్రం చేయకండి