సైకిల్ తొక్కితే మానసిక ఒత్తిడి తగ్గుతుందా!

Photo; Pexels

By Chatakonda Krishna Prakash
Jan 04, 2025

Hindustan Times
Telugu

సైకిల్ తొక్కడం (సైక్లింగ్) వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. మంచి వ్యాయామం అవుతుంది. అయితే, సైక్లింగ్ వల్ల మానసికంగానూ లాభాలు ఉంటాయి. 

Photo: Pexels

మానసిక ఒత్తిడి సమస్యను కూడా ఔట్‍డోర్/ఇండోర్ సైక్లింగ్ తగ్గించగలదు. శరీరంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

సైక్లింగ్ వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ విడుదల ఎక్కువ అవుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

సైక్లింగ్ వల్ల ఆందోళన, డిప్రెషన్ కూడా తగ్గుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మానసిక సమస్యలతో బాధపడే వారు సైక్లింగ్ చేస్తే ఉపశమనంగా అనిపిస్తుంది. 

Photo: Pexels

సైక్లింగ్ వల్ల శరీరానికి బోలెడు లాభాలు ఉంటాయి. రెగ్యులర్ సైక్లింగ్ చేస్తే కండరాలు పెరిగేందుకు తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

Photo: Pexels

బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా సైక్లింగ్ చేయడం మంచి వ్యాయామంగా ఉంటుంది. సైక్లింగ్‍తో క్యాలరీ ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో వెయిట్ లాస్‍కు ఉపకరిస్తుంది. 

Photo: Pexels

గుండె ఆరోగ్యానికి కూడా ఔట్‍డోర్/ ఇండోర్ సైక్లింగ్ మేలు చేస్తుంది. మంచి కార్డియో వ్యాయామంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Photo: Pexels

ఎర్ర చీర, పచ్చ రైకలో తళుక్కుమన్న బిగ్ బాస్ బ్యూటి దివి వాద్యా

Instagram