లవంగాల వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందా!

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Mar 26, 2025

Hindustan Times
Telugu

శృంగార సామర్థ్యం, కోరికలు మెరుగ్గా ఉండటంలో తీసుకునే ఆహారాలు కూడా కీలకంగా ఉంటాయి. లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్న వారికి కొన్ని రకాల ఆహారాలు తోడ్పడతాయి. అందులో లవంగాలు ముఖ్యమైనవి. 

Photo: Pexels

లవంగాలు తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పురుషులు, స్త్రీల్లో వాంఛ అధికమై లైంగిక చర్యలో మెరుగ్గా పాల్గొనేలా ఇవి చేయగలవు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Photo: Pexels

లవంగాలు తీసుకోవడం వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో శృంగార కోరిక, సామర్థ్యం అధికం అవుతాయి. 

Photo: Pexels

లవంగాలు తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అన్ని అవయవాలకు రక్తం బాగా సరఫరా అవుతుంది. దీనివల్ల అంగస్తంభన మెరుగవుతుంది. ఓవరాల్‍గా లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

Photo: Pexels

లవంగాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకుంటే పురుషుల్లో వీర్యం నాణ్యత మెరుగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది. పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలు తగ్గేందుకు కూడా సహకరించగలదు. 

Photo: Pexels

మహిళల్లో నెలసరి నొప్పులు, ఇబ్బందులు తగ్గేందుకు కూడా లవంగాలు తోడ్పడతాయి. శృంగారం మెరుగ్గా చేసేందుకు సహకరిస్తాయి. 

Photo: Pexels

లవంగాలను రోజుకు ఒకటో, రెండో నేరుగా చప్పరించవచ్చు. వంటకాల్లోనూ లవంగాలను వేసుకోవచ్చు. లవంగాలతో టీ చేసుకోవచ్చు. లవంగాల పొడిలో తేనె కలుపుకొని రోజులో ఓ స్పూన్ తినొచ్చు.

Photo: Pexels

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త