మీరు సూపర్ మార్కెట్లతో తరచూ ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారా? అయితే అవి సురక్షితమైనవో? కాదో? వాటిల్లో ఏ పదార్థాలు వాడుతున్నారో లేబుళ్ల బట్టి తెలుసుకోవచ్చు.
మీరు సూపర్ మార్కెట్లతో తరచూ ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారా? అయితే అవి సురక్షితమైనవో? కాదో? వాటిల్లో ఏ పదార్థాలు వాడుతున్నారో లేబుళ్ల బట్టి తెలుసుకోవచ్చు.
pexels
By Bandaru Satyaprasad Jun 04, 2024
Hindustan Times Telugu
వేగవంతమైన జీవితంలో క్షణాల్లో ఆకలి తీర్చుకునేందుకు ప్యాక్ చేసిన ఆహారాలను వినియోగిస్తున్నారు. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు ప్రొసెస్ చేసినవే. వీటితో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. '
pexels
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) కీలక సూచనలు చేసింది. ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేసే ముందు లేబుల్ పై మూడు విషయాలను చెక్ చేయాలని సూచించింది.
pexels
ఆహార ఉత్పత్తుల తయారీ తేదీ, గడువు తేదీ, బెస్ట్ బిఫోర్ తేదీలను వినియోగదారులు గమనించాలి.
pexels
తయారీ తేదీ - తయారీ తేదీ ఆహార ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్ తేదీ గురించి తెలియజేస్తుంది.
pexels
బెస్ట్ బిఫోర్ తేదీ - బెస్ట్ బిఫోర్ డేట్.. ఆహారాన్ని ఎప్పటి లోపు వినియోగించాలో తెలియజేస్తుంది. ఆ తేదీ దాటిన తర్వాత రంగు, రుచి, వాసన, తాజాదనం, పోషకాలు ప్రభావితం కావొచ్చు. అయితే ఆ ఆహారం తినడానికి సురక్షితం కాదని అర్థం కాదు.
pexels
గడువు తేదీ - ఆహార ఉత్పత్తులపై గడువు తేదీ(Expiry Date) నిర్థిష్ట సమయం తర్వాత ఆ ఆహారం వినియోగానికి సురక్షితం కాదని తెలియజేస్తుంది.
pexels
ICMR సూచనలు -ఆహార ఉత్పత్తుల లేబుళ్లపై చిహ్నాలు, లోగోలు గమనించాలని ఐసీఎంఆర్ సూచిస్తుంది. ఆ చిహ్నాలు ఆహారం గురించి మరింత సమాచారం అందిస్తాయని తెలిపింది.
pexels
ఆహార ఉత్పత్తుల్లో వినియోగించే పదార్థాలు, ఆహార మార్గదర్శకాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ సూచిస్తుంది. వినియోగదారులు లేబుళ్లపై లోగోల గురించి తెలుసుకోవాలని కోరుతుంది.
pexels
పోషకాహార సమాచారంతో మీరు ఏం తినాలి, వేటికి దూరంగా ఉండాలనేది తెలుస్తుంది. పిల్లల అందించే ఆహార పదార్థాలపై అవగాహన వస్తుంది.
pexels
రక్త హీనతతో బాధ పడుతున్నారా?.. ఇవి మీ ఆహారంలో చేర్చండి..