మెదడు పనితీరును మెరుగుపరిచే ఆహారాలు తీసుకుంటే.. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరింత పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మెదడు శక్తిని పెంచే 6 ఆరోగ్యకరమైన ఆహారాల గురించి తెలుసుకుందాం.
pexels
ఫ్యాటీ ఫిష్- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఫ్యాటీ ఫిష్ మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. మీ ఆహారంలో మాకేరెల్, సాల్మన్, సార్డినెస్, ట్యూనా చేపలను చేర్చండి. ఫ్యాటీ ఫిష్ తింటే గుండె జబ్బులు, డిప్రెషన్, ఆర్థరైటిస్ ప్రమాదం తగ్గుతుంది.
pexels
ఆకుకూరలు - ఆకు కూరలు మెదడు ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారాలు. ఇవి గుండె, రక్తనాళాలను రక్షిస్తాయి. కాలే, బచ్చలికూర, కొల్లార్డ్స్, బ్రోకలీ వంటి ఆకుకూరలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
pexels
గింజలు, విత్తనాలు - గింజలు, విత్తనాలలో మెదడుకు మేలు చేసే లుటిన్, డీహెచ్ఏ, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, బి విటమిన్లు ఉంటాయి. వాల్ నట్స్, పిస్తా, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, చియా బ్రెయిన్ హెల్త్ కు మేలు చేస్తాయి.
pexels
బెర్రీస్- బెర్రీస్ లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి మెదడులోని సెల్ డ్యామేజ్ ని తగ్గించి రిపేర్ చేస్తాయి. మీ ఫుడ్ లో బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ చేర్చుకోండి.
pexels
డార్క్ చాక్లెట్- డార్క్ చాక్లెట్ లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి శరీరం, మెదడులో ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంతో సహాయపడతాయి.
pexels
తృణధాన్యాలు -తృణధాన్యాలలో విటమిన్ బి, డి, ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వోట్స్, బార్లీ, క్వినోవాలో అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు వాపును తగ్గిస్తాయి.