బ్రెయిన్ పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచే 6 వ్యాయామాలు
pexels
By Bandaru Satyaprasad Jan 20, 2025
Hindustan Times Telugu
శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మీ మెదడును బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యం. బ్రెయిన్ పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతతకు మెరుగుపరచడానికి ఈ 6 మెదడు వ్యాయామాలను ప్రయత్నించండి.
pexels
మైండ్ పుల్ బ్రీతింగ్ - ఈ వ్యాయామంలో శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం, క్రమం తప్పకుండా సాధన చేస్తే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. భావోద్వేగ నియంత్రణను పెంచుతుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది.
pexels
సుడోకు, పజిల్స్ - ఈ గేమ్స్ సమస్య పరిష్కార సామర్థ్యాలను సవాల్ చేయడం ద్వారా మీ మెదడును ఉత్తేజపరుస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. తార్కిక నైపుణ్యాలను పదును పెడుతుంది.
pexels
ధ్యానం - ధ్యానం మానసిక విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది. మీ మానసిక ఆరోగ్యానికి ధ్యానం ఎంతో గొప్పది.
pexels
విజువలైజేషన్ - విజువలైజేషన్ మీ జ్ఞాపకశక్తి, సృజనాత్మక ఆలోచన, ఏకాగ్రతను బలపరుస్తుంది. మెంటల్ ఇమేజనరీ ఎంత స్పష్టంగా ఉంటే, మీ ఏకాగ్రత సామర్థ్యం అంతగా మెరుగుపడుతుంది.
pexels
కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం- కొత్త అభిరుచి లేదా భాష లేదా సంగీత వాయిద్యం వంటి తెలియని వాటిని నేర్చుకోవడం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
pexels
శారీరక వ్యాయమం- నడక లేదా డాన్స్ వంటి సాధారణ శారీరక శ్రమ మెదడు పనితీరును కూడా పెంచుతుంది. వ్యాయామం మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. మానసిక స్థితి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.