ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు చాలా స్టైలిష్‌గా ఉంటారట!
By Ramya Sri Marka Mar 26, 2025
Hindustan Times Telugu
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు ప్రధాన సంఖ్య 6 అవుతుంది.
ఈ అబ్బాయిలకు శుక్ర గ్రహం అధిపతిగా వ్యవహరిస్తుంది. ఇది ప్రేమ, అందం, విలాసం, కళ, ఆనందం వంటి వాటికి సంకేతం.
ఈ అబ్బాయిలు చాలా సరదాగా ఉంటారు, ఇతరులతో ఇట్టే కలిసిపోతారు. అందరినీ సులువుగా ఆకర్షిస్తారు.
ఈ తేదీల్లో పుట్టిన వారికి లక్ష్యాలను సాధించే సామర్థ్యం కూడా ఎక్కువే.
వీరు తెలివైన వారు మాత్రమే కాదు.. చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. ఎల్లప్పుడూ హుందాగా, అందమైన దుస్తులను ధరిస్తారు. ఫ్యాషన్ ఫాలో అవడం అంటే వీరికి బాగా ఇష్టం.
ఈ అబ్బాయిలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. వీరి ముఖంపై వృద్ధాప్యం కూడా ఆలస్యంగా కనిపిస్తుంది.
ఈ తేదీల్లో జన్నించిన అబ్బాయిలు మంచి మాటకారులు కూడా. వీరి మాటల్లో లాజిక్ ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం.
సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి