నిర్మాతతో హీరోయిన్ పెళ్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరో సోదరి!

By Sanjiv Kumar
Jun 05, 2025

Hindustan Times
Telugu

బాలీవుడ్ హీరోయిన్ హీనా ఖాన్ తన చిరకాల ప్రియుడు, నిర్మాత రాకీ జైస్వాల్‌ను జూన్ 4న వివాహం చేసుకుంది.

యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌ని నిర్మించిన రాకీ జైస్వాల్, స్టార్ హీరో ఆమీర్ ఖాన్ సోదరి హీనా ఖాన్ అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నారు. 

దశాబ్దానికి పైగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ప్రతి సుఖదుఃఖాల్లో ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. చివరిగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

ఈ విషయాన్ని హీనా బుధవారం తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంది.

పెళ్లికూతురుగా హీనా ఖాన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా చీర, ఆభరణాల్లో అందంగా కనిపించింది.

బంగారు, వెండి దారాలతో శతాబ్దాల నాటి ఆకృతులను ఆవిష్కరించే ఓపల్ గ్రీన్ హ్యాండ్లూమ్ చీరను హీనా ఖాన్ వేసుకుంది. 

ఈ వెడ్డింగ్ వేడుకల్లో రాకీ జైస్వాల్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సిగ్నేచర్ కుర్తా ధరించాడు.

ఈ ఫొటోలను పోస్ట్ చేసిన హీనా ఖాన్ 'రెండు వేర్వేరు ప్రపంచాల నుంచి ప్రేమ విశ్వాన్ని సృష్టించాం" అని రాసుకొచ్చింది.

"మా మధ్య విభేదాలు మాయమయ్యాయి, మా హృదయాలు ఒక్కటయ్యాయి, జీవితాంతం ఒక బంధాన్ని ఏర్పరుచుకున్నాయి" అని హీనా రాసుకొచ్చింది.

'మనమే మా ఇల్లు, మా వెలుగు, మా ఆశ, అందరం కలిసి అన్ని అడ్డంకులను అధిగమిస్తాం." అని తెలిపింది.

"ఈ రోజు, మా కలయిక ఎల్లప్పుడూ ప్రేమతో చట్టంలో బంధించబడింది. భార్యాభర్తలుగా మీ ఆశీస్సులు, శుభాకాంక్షలు కోరుతున్నాం" అని కోరింది బాలీవుడ్ హీరోయిన్ హీనా ఖాన్.

సినీ పరిశ్రమకు చెందిన పలువురు తారలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. "ఎల్లప్పుడూ కలిసి సంతోషంగా ఉండండి" అని హాట్ బ్యూటి బిపాసా బసు వ్యాఖ్యానించింది.

మలైకా అరోరా కూడా ఈ జంటను ఆశీర్వదించింది. "చాలా అందంగా ఉంది. అభినందనలు, మీరందరూ ప్రేమ, ఆనందానికి అర్హులు. " అని కామెంట్ చేసింది.

హీనా ఖాన్, రాకీ జైస్వాల్ తొలిసారి యే రిష్తా క్యా కెహ్లాతా హై సెట్‌లో కలుసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్‌ సోదరి అయిన హీనా ఖాన్ హ్యాక్‌డ్ సినిమాతోపాటు పలు సీరియల్స్‌లో నటించింది.

 నేరేడు పండ్ల సీజన్..! వీటిని ఎందుకో తినాలో తెలుసా

image credit to unsplash