బరువు తగ్గేందుకు బ్లూబెర్రీలు ఎలా ఉపయోగపడతాయంటే..

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jun 23, 2024

Hindustan Times
Telugu

బరువు తగ్గాలనుకునే (వెయిట్ లాస్) వారికి బ్లూబెర్రీలు చాలా ఉపయోగపడతాయి. ప్రయత్నానికి ఇవి సహకరిస్తాయి. బరువు తగ్గేందుకు బ్లూబెర్రీలు ఎలా తోడ్పడతాయో ఇక్కడ చూడండి.

Photo: Pexels

శరీరంలోని ఫ్యాట్‍ కరిగేందుకు బ్లూబెర్రీలు సహకరిస్తాయి. కొలెస్ట్రాల్‍ను కూడా తగ్గించగలవు. ఇలా వెయిట్ టాస్‍కు సహకరిస్తాయి. 

Photo: Pexels

బ్లూబెర్రీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువ సేపు ఉంటుంది. చీటికిమాటికి తినాలని అనిపించే ఫీలింగ్‍ను తగ్గిస్తాయి. దీంతో క్యాలరీలు తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

బ్లూబెర్రీలు టిగ్లెసిరైడ్స్‌ తగ్గించి, బ్లడ్ షుగర్ లెవెళ్లను మెరుగుపరచగలవు. దీనివల్ల మీ బరువు తగ్గే ప్రయత్నాలకు ఇవి మేలు చేస్తాయి.  

Photo: Pexels

బ్లూబెర్రీల్లో చాలారకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అలాగే, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తింటే బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.

Photo: Pexels

బ్లూబెర్రీలు తియ్యగా రుచికరంగా ఉన్నా ఫ్యాట్ ఫ్రీగా ఉంటాయి. అందుకే మీరు చేసుకునే హెల్దీ ఫుడ్స్‌లో కూడా వీటిని యాడ్ చేసుకోవచ్చు. 

Photo: Pexels

 ఈ వేసవిలో అతిగా పుచ్చకాయ తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash