రక్తదానం వల్ల ఇతరు ప్రాణాలను కాపాడిన వాళ్లమవుతాం. అయితే దీనివల్ల రక్తాన్ని దానం చేసిన వాళ్లకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి

Pixabay

By Hari Prasad S
Jan 28, 2025

Hindustan Times
Telugu

రక్తదానం చేసే సమయంలో శరీరం ఎండోమార్ఫిన్‌ను రిలీజ్ చేస్తుంది. దీనివల్ల రక్తాన్ని దానం చేసే వాళ్లలో ఒత్తిడి తగ్గుతుంది.

Pixabay

రక్తదానం అన్నది చాలా గొప్ప పని. అది చేస్తున్నందుకు మనసుకు ఎంతో తృప్తి లభించి ఎమోషనల్‌ హెల్త్ కూడా బాగుంటుంది

Pixabay

రక్తదానం వల్ల శరీరం కొత్త రక్తకణాలను తయారు చేసుకుంటుంది. ఇది రక్త ప్రసరణ మరింత మెరుగ్గా అయ్యేలా చేసి శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది

Pixabay

రక్తదానం మనలో తెలియకుండానే నెగటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది. తోటివారికి సాయం చేస్తున్నామన్న ఆత్మసంతృప్తికి కారణమవుతుంది

Pixabay

ఒంటరితనంతో బాధపడుతున్న వారికి ఈ రక్తదానం అనేది సమాజానికి దగ్గర చేస్తుంది. దీనివల్ల ఆ ఒంటరితనం నుంచి బయటపడవచ్చు

Pixabay

రక్తదానం వల్ల శరీరంలో అధికంగా ఉన్న ఐరన్‌ను బయటకు పంపించే వీలు కలుగుతుంది. ఇది వివిధ అవయవాలకు మేలు చేస్తుంది.

Pixabay

రక్తదానం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గి గుండె పోటుకు కారణమయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు దూరమవుతాయి

Pixabay

రాత్రిపూట మటన్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!

Image Source From unsplash