పురాతన కాలం నుంచి కాకర కాయ మధుమేహ వ్యాధికి మందుగా ఉపయోగపడుతోంది.
రక్తంలో, మూత్రంలో చక్కెర శాతం తగ్గించే ప్లాంట్ ఇన్సూలిన్ పదార్ధం కాకరలో ఉన్నట్లుగా గుర్తించారు.
రోజుకు మూడు సార్లు నాలుగు స్పూన్ల చొప్పున కాకర రసం సేవిస్తే ప్రాథమిక స్థాయిలో ఉండే మధుమేహం క్రమంగా తగ్గిపోతుంది.
మధుమేహం తీవ్రంగా ఉన్న వారిలో కూడా రోజూ కాకర రసం సేవిస్తే దానిని అదుపులో ఉంచుకోవచ్చు.
తాజా కాకరకాయలు లబించకపోతే అవి లభించే సీజనులో కాకర కాయల్ని గింజలతో పాటు సన్నటి ముక్కలుగా తరిమి ఎండబెట్టి, వాటిని పొడిచేసి దాచుకుని వాడుకోవచ్చు.
మధు మేహ రోగుల్లో పోషకాహార లోపం సమస్యలు తలెత్తుతాయి. కాకరలో విటమన్‌లు, ఖనిజ లవనాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ బి1, బి2, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. మధుమేహ రోగులకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.
కాకరకాయల్ని తరచూ ఆహారంలో తీసుకుంటే హైపర్ టెన్షన్ తగ్గడంతో పాటు కళ్ల వ్యాధులు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కాకర ఆకుల రసం ఫైల్స్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది.
కాకరతో గజ్జి, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల చికిత్సకు కూడా పనిచేస్తుంది.
కాకర కాయలతో రక్తశుద్ధి జరుగుతుంది. కాకరలో ఉండే చేదు కడుపులో నులిపురుగుల నాశనానికి ఉపయోగపడుతుంది. 100 గ్రాముల కాకరలో తేమ 92.4శాతం, ప్రొటీన్లు 1.6శాతం, కొవ్వు 0.2శాతం, ఖనిజ లవణాలు, పీచు పదార్ధం 0.8శాతం, కార్బో హైడ్రేట్లు 4.2శాతం, క్యాలరీలు 45 లభిస్తాయి.