పదో తరగతి పరీక్షలపై కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ విద్యాశాఖ. ఇప్పటి వరకు 11 పేపర్లతో పది పరీక్షలు నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం 6 పేపర్లకు కుదించారు. అయితే తాజాగా నిర్వహించబోయే పరీక్షల్లో విద్యార్థులకు ఇచ్చే బిట్ పేపర్(మల్టీపుల్ చాయిస్ ప్రశ్నపత్రం)ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని నిర్ణయించింది. ఇక జనరల్ సైన్స్ పరీక్షలోని రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇవ్వాలని పేర్కొంది.