బిర్యానీ ఆకులు రోజువారీ వంటలలో ఉపయోగించే పదార్థాలలో ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash

By Anand Sai
Jan 15, 2025

Hindustan Times
Telugu

బిర్యానీ ఆకులను నీళ్లలో మరిగించి తాగాలి. ఆకులోని పోషకాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.

Unsplash

బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బిర్యానీ ఆకును నీళ్లలో మరిగించి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Unsplash

మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెరను సహజంగా నియంత్రించాలనుకుంటే బిర్యానీ ఆకు నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

Unsplash

బిర్యానీ ఆకు నీళ్లు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

Unsplash

బిర్యానీ ఆకు నీరు జీవక్రియను మెరుగుపరుస్తుంది. అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Unsplash

బిర్యానీ ఆకు నీరు సిద్ధం చేయడానికి ఒక పాత్రలో 1 కప్పు నీరు పోసి స్టవ్ మీద ఉంచి, 2-3 బిర్యానీ ఆకులు వేసి 5 నిమిషాలు మరిగించాలి.

Unsplash

తర్వాత దాన్ని వడపోసి అందులో తేనె, నిమ్మరసం కలిపితే రుచిగా ఉంటుంది.  ఆ నీటిని రోజుకు 1-2 సార్లు తాగవచ్చు.

Unsplash

కరివేపాకులో అనేక పోషకాలు.. రోజు తింటే సంపూర్ణ ఆరోగ్యం!

pixabay