జుట్టు, చర్మ సంరక్షణకు బయోటిన్ అధికంగా ఉండే 5 ఆహారాలు ఇవే
pexels
By Bandaru Satyaprasad Feb 18, 2025
Hindustan Times Telugu
బయోటిన్ ను విటమిన్ B7 అని కూడా పిలుస్తారు. ఇది జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యానికి అవసరం. మీ రోజువారీ ఆహారంలో తీసుకోవాల్సిన 5 బయోటిన్ రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
pexels
పుట్టగొడుగులు
pexels
పుట్టగొడుగులు బయోటిన్ ఆధారిత ఆహారం. ఇవి చర్మ కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.
pexels
గుడ్లు - గుడ్లు బయోటిన్ రిచ్ ఫుడ్. గుడ్డులోని పచ్చసొన చర్మ సంరక్షణను ప్రోత్సహించే ప్రోటీన్, అమైనో ఆమ్లాలను అందిస్తాయి. గుడ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జుట్టు సన్నబడకుండా నిరోధించవచ్చు.
pexels
సాల్మన్ చేప - ఈ ఫ్యాటీ ఫిష్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, ఇన్ ఫ్లమేషన్ ను నివారించడానికి సహాయపడుతుంది. మెరిసే చర్మం, బలమైన జుట్టు కోసం మీ ఆహారంలో సాల్మన్ చేపలను చేర్చుకోండి.
pexels
చిలగడ దుంపలు - బయోటిన్, విటమిన్ ఎ వంటి ముఖ్యమైన విటమిన్లతో నిండిన చిలగడదుంపలు మీ చర్మ ఆర్యోగాన్ని, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వీటిలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
pexels
గింజలు, విత్తనాలు - బాదం, వాల్ నట్స్ , పొద్దుతిరుగుడు విత్తనాలు బయోటిన్ కు అద్భుతమైన సోర్స్. బయోటిన్ చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. చర్మ పొడిబారకుండా సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
pexels
డార్క్ చాక్లెట్లతో లైంగిక కోరికలు పెరుగుతాయా..! ఈ 6 విషయాలు తెలుసుకోండి