చర్మం బాగుండాలంటే ప్రతీ రోజూ ఈ ఐదు పనులు చేయండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Mar 03, 2024

Hindustan Times
Telugu

చర్మపు ఆరోగ్యం బాగుండాలన్నా.. మెరుపు పెరగాలన్నా ప్రతీ రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తుండాలి. ఆరోగ్యకరమైన చర్మం కోసం పాటించాల్సిన 5 అలవాట్లు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

మీ చర్మం ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‍గా ఉండాలంటే ప్రతీ రోజూ తగినంత నీరు తప్పకుండా తాగాలి. తగిన మోతాదులో నీరు, పండ్ల రసాలు లాంటి ఫ్లయిడ్స్ తీసుకుంటే చర్మానికి రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. చర్మపు మెరుపు కూడా పెరుగుతుంది.  

Photo: Pexels

నిద్రించే ముందు తప్పనిసరిగా ఫేస్‍వాష్ చేసుకోవాలి. రోజంతా దుమ్ము, కాలుష్యంతో చర్మానికి కలిగిన డ్యామేజ్.. ఈ క్లిన్స్ చేసుకోవడం వల్ల తగ్గుతుంది. గోరువెచ్చని నీటితో వాష్ చేసుకుంటే బెస్ట్. 

Photo: Pexels

మీ చర్మానికి సన్‍స్క్రీన్ పూసుకోవడం కూడా చాలా ముఖ్యం. యూవీ కిరణాల వల్ల చర్మానికి కలిగే హానిని ఇవి నివారిస్తాయి. సన్‍స్క్రీన్ అన్ని కాలాల్లోనూ పూసుకోవాలి. 

Photo: Pexels

చర్మానికి ప్రతీ రోజూ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీని వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. 

Photo: Pexels

చర్మపు ఆరోగ్యం కోసం ప్రతీ రోజు వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం. వ్యాయామం చేస్తే చర్మపు కణాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ఆరోగ్యం, మెరుపు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

హీట్ రాజేస్తున్న శివాత్మిక రాజశేఖర్ హాట్ ఫొటోలు

Instagram