నిద్ర మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన స్లీప్ పొజిషన్ లు తీవ్రమైన అనారోగ్యాలను మెరుగుపరచడం, నివారించడంలో సహాయపడతాయి.
pexels
By Bandaru Satyaprasad Jan 19, 2025
Hindustan Times Telugu
సరైన నిద్రతో పాటు ఏ పొజిషన్ లో నిద్ర పోతున్నామో కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పేలవమైన నిద్రతో బరువు పెరగడం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. నిద్రలేమి గుండె, మధుమేహం, రక్తపోటు, ఊబకాయ సమస్యలకు దారితీయవచ్చు.
pexels
కుడివైపు నిద్ర- కుడి వైపునకు తిరిగి పడుకుంటే గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. ఈ పొజిషన్ లో గుండెపై తక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది కూడా కుడి వైపున నిద్రించడం వల్ల గుండెల్లో మంట, అన్నవాహికలో యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది.
pexels
ఎడమవైపు నిద్ర- ఎడమ వైపునకు నిద్రపోతే జీర్ణ సమస్యలు తగ్గుతాయని వైద్యులు అంటున్నారు. కడుపులో వ్యర్థాల ప్రయాణం సులభం అవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ తీవ్రతను తగ్గిస్తుంది.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎడమవైపు పడుకోవడం చాలా మంచిది. ఎడమ వైపున పడుకున్నప్పుడు పిండం సర్క్యులేషన్ ఆప్టిమైజ్ అవుతుంది.
pexels
గుండెపోటు వచ్చిన వాళ్లు కాస్త ఎత్తులో తల పెట్టుకుని వెల్లకిలా పడుకోవడంతో గుండెపై ఒత్తిడిని తగ్గడం, శ్వాస మెరుగుపడుతుంది. ఎడమ వైపున నిద్రపోవడం కూడా ప్రయోజనకరమే కానీ కుడి వైపున పడుకోవడం మానుకోవాలని సూచిస్తారు.
pexels
అధిక రక్తపోటు ఉన్న వారు తల కాస్త ఎత్తులో పెట్టుకుని వెల్లకిలా పడుకోవడం వల్ల రక్త నాళాలకు ఉపశమనం లభిస్తుంది. మెరుగైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. గుండెపై భారాన్ని తగ్గిస్తుంది.
pexels
గుండెల్లో మంట లేదా ఇతర జీర్ణ సమస్యలకు సంబంధించిన సమస్యలున్న వారు ఎడమ వైపున పడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది అన్నవాహిక కింద ఉంచుతుంది కాబట్టి యాసిడ్ తిరిగి పైకి రావడానికి కొంచెం అవకాశం ఉంటుంది. అన్నవాహికను వేగంగా క్లియర్ చేయడానికి సహాయపడింది.
pexels
జలుబు లేదా దగ్గు ఉన్నవారు దిండుపై తల పెట్టి పడుకోవడం వల్ల శ్వాసనాళాలు తెరుచుకుని ముక్కులో అడ్డంకులను నివారిస్తుంది. ఈ పొజిషన్ లో నిద్రపోతే దగ్గు, గొంతులో శ్లేష్మం చేరడం తగ్గుతుంది.
pexels
ఆరోగ్యకరమైన నిద్ర కోసం ఎల్లప్పుడూ మీ వెన్నెముకను సహజ స్థితిలో ఉంచుకోండి. మీకు అసౌకర్యంగా అనిపించే లేదా శరీరంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించే పొజిషన్లలో నిద్రపోవద్దు.
pexels
గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.