వేసవి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఆవకాయ పచ్చళ్లు(మామిడి కాయ పచ్చడి) చేస్తుంటారు. అయితే ఆవకాయ, ఊరగాయ పచ్చళ్లకు ఏ రకం మామిడి కాయలు అనువైనవో తెలుసుకుందాం.

pexels

By Bandaru Satyaprasad
May 05, 2025

Hindustan Times
Telugu

మామిడి అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ఇవి జుట్టు, చర్మం, కళ్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పోషకాలను అందిస్తాయి. 

pexels

ఆవకాయ పచ్చడికి పుల్లగా, కాస్త తీపిగా, గట్టిగా ఉండే రాజపురి, తోతాపురి, బంగినపల్లి, అల్ఫోన్సో, నీలం, కలపడి, సెందూర, రుమాని  మామిడికాయ రకాలు ఎక్కువగా వాడుతుంటారు. ఈ రకం మామిడికాయలతో పట్టిన పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. 

pexels

తోతాపురి-ఈ రకం మామిడికాయలు దృఢంగా, పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. ఇవి ఊరగాయకు బాగా పనిచేస్తాయి.  

pexels

 బంగినపల్లి-ఈ రకం మామిడికాయలు ఆవకాయకు బాగా అనుకూలంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగినపల్లి మామిడితో ఎక్కువగా పచ్చళ్లు పెడుతుంటారు.  

pexels

అల్ఫోన్సో, నీలం, కలపడి, సెందూర, రుమాని, రాంకేలా, రాజపురి, గోల ఆవకాయ, ఊరగాయ పచ్చళ్లకు విరివిరివగా వాడుతుంటారు. 

pexels

ఆవకాయ పచ్చడిని పచ్చి మామిడికాయ ముక్కలు ఆవాల పొడి, ఎర్ర కారం పొడి, మెంతి గింజలు, ఉప్పు, నూనెతో కలిపి తయారు చేస్తారు.  

pexels

ఊరగాయకు ఉత్తమ మామిడి రకాలు 

కేసర్ మామిడి - కేసర్ మామిడి పండ్లు కుంకుమ రంగులో ఉంటాయి. ఇవి ఊరగాయలకు సరైనవి. గుజరాత్‌లో పండించే కేసర్ మామిడి పండ్లు ఊరగాయలకు టాంజి రుచిని అందిస్తాయి.   

pexels

రాజపురి మామిడి- కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పండించే రాజపురి మామిడి పండ్లు పెద్ద పరిమాణంలో తీపి రుచిలో ఉంటాయి.  వీటితో ఎక్కువగా ఊరగాయ పచ్చడి పెడుతుంటారు.   

pexels

నీలం మామిడి - నీలం మామిడి పండ్లు చిన్న, మధ్య తరహా మామిడి పండ్లు. ఇవి పసుపు రంగు స్కిన్, జ్యూసీ గుజ్జు కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో పండిస్తుంటారు. ఇవి ఊరగాయ తయారీకి ఉపయోగిస్తారు.  

pexels

బాదామి మామిడి, హాడెన్, కెంట్, బ్రూక్స్, తోతాపురి మామిడి కాయలు ఊరగాయ పచ్చడికి అనుకూలం.  

pexels

విటమిన్ లోపాలను గుర్తించండి 

ఈ సమస్యలు విటమిన్ లోపాల వల్లనే వస్తాయని మీకు తెలుసా?

PEXELS, RUSH