రంజాన్ సమయంలో హైదరాబాద్ ఐకానిక్ హలీమ్ ను ఆస్వాదించడానికి నగరంలో టాప్ 10 ప్రదేశాలు మీ కోసం.   

unsplash

By Bandaru Satyaprasad
Mar 10, 2024

Hindustan Times
Telugu

హోటల్ రుమాన్ - టోలీ చౌకీలో ఉన్న హోటల్ రుమాన్ టేస్టీ హలీమ్ అందిస్తుంది. ఇఫ్తార్ భోజనానికి అనువైన ప్రదేశం. రుచికరమైన హలీమ్ తో బెస్ట్ బిర్యానీ అందిస్తున్నామని హోటల్ రుమాన్ నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇక్కడ వెజ్, నాన్ వెబ్ హలీమ్ అందుబాటులో ఉంటుంది.   

HT Telugu

చిచ్చాస్- లక్డీకాపూల్‌లో ఉన్న చిచ్చాస్ హోటల్ హైదరాబాదీ హలీమ్ తో పాటు బిర్యానీకి ఫేమస్. ఇఫ్తార్ విందు కోసం తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.   

Twitter

గ్రీన్ బావర్చి -కొండాపూర్‌లోని గ్రీన్ బావర్చి, రుచికరమైన హలీమ్ తో పాటు హైదరాబాదీ డిలైట్‌లను అందిస్తుంది. ఇఫ్తార్ విందును ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం. హలీమ్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, షామీ కబాబ్ అందుబాటులో ఉంటాయి.   

Twitter

పిస్తా హౌస్- ఓల్డ్ సిటీలో ఉన్న ఔట్‌లెట్‌తో పాటు నగరంలోని పలు చోట్ల పిస్తా హౌస్ రంజాన్ సందర్భంగా హలీమ్ అందిస్తుంది. రంజాన్ టైంలో పిస్తా హౌస్ హలీమ్ కు చాలా క్రేజ్ ఉంటుంది. ఓల్డ్ సిటిలోని పిస్తా హౌస్ హోటల్ తయారు చేసి నగరంలోని ఔట్ లెట్లకు సరఫరాల చేస్తుంటారు.   

Twitter

సర్వి రెస్టారెంట్- బంజారాహిల్స్ లోని సర్వి రెస్టారెంట్ రుచికరమైన హలీమ్‌ కోసం జనం క్యూకడుతుంటారు. హలీమ్ తో పాటు ఇతర రుచికరమైన ఫుడ్ ఆస్వాదించడానికి హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అంటుంటారు కస్టమర్లు.   

Twitter

హలీమ్ హౌస్- అబిడ్స్‌లోని హలీమ్ హౌస్, హైదరాబాద్‌లోని అత్యంత ప్రామాణికమైన, నోరూరించే హలీమ్‌ను అందిస్తుంది. అంకితభావంతో కూడిన సిబ్బంది ఇఫ్తార్ అనుభూతిని పొందేందుకు గొప్ప ఎంపిక.   

Twitter

కేఫ్ 555- మసాబ్ ట్యాంక్‌లోనే కేఫ్ 555 రుచికరమైన హలీమ్, ఇతర హైదరాబాదీ వంటకాలకు ప్రసిద్ధి. అధునాతన హోటల్ వాతావరణం, స్నేహపూర్వక సిబ్బంది సర్వీస్.. రంజాన్ సందర్భంగా తప్పక సందర్శించవలసిన ప్రదేశంగా ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.  

Twitter

మెహ్ఫిల్- నాంపల్లిలో ఉన్న మెహ్ఫిల్ అద్భుతమైన హలీమ్ తో పాటు వివిధ రకాల హైదరాబాదీ వంటకాలకు ప్రసిద్ధి. అందమైన డెకరేషన్, ఆహ్లాదకరమైన వాతావరణం ఇఫ్తార్ విందు ఆస్వాదించడానికి సరైన ప్రదేశం.   

Twitter

ఇక్బాల్ హోటల్ - నూర్ఖాన్ బజార్‌లో ఉన్న ఇక్బాల్ హోటల్, ఇరానీ స్టైల్‌లో నోరూరించే హలీమ్‌ను అందిస్తుంది. చాలా ఏళ్లుగా వీళ్లు హలీమ్ ను అందిస్తున్నారు. ఇక్కడి ఆహ్లాదమైన వాతావరణం సంప్రదాయ వంటకాలను ఆస్వాదించడానికి మంచి ప్రదేశం.    

Twitter

హోటల్ నయాబ్ - దారుల్‌షిఫా వద్ద ఉన్న హోటల్ నయాబ్, బెస్ట్ క్వాలిటీ హలీమ్ తోపాటు హైదరాబాదీ క్లాసిక్‌ వంటకాలను అందిస్తుంది.  

unsplash

ప్లేట్లెట్ల సంఖ్య అధికమయ్యేందుకు ఈ 5 రకాల పండ్లు తినండి!

Photo: Pexels