శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరిగేందుకు ఉపయోగపడే ఫుడ్స్ ఇవే

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Sep 24, 2023

Hindustan Times
Telugu

అనారోగ్యానికి గురైన సమయాల్లో కొన్నిసార్లు రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్లు పెరిగేందుకు ఎలాంటి ఆహారాలు ఉపకరిస్తాయో ఇక్కడ తెలుసుకోండి. 

Photo: Unsplash

చేపలు, కోడిగుడ్లలో విటమిన్ బీ12 ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇవి తింటే శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. 

Photo: Unsplash

పాలకూర తినడం వల్ల శరీరానికి ఐరన్, ఫోలెట్, విటమిన్ కే అందుతాయి. దీంతో ప్లేట్లెట్ల ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది. 

Photo: Unsplash

ప్లేట్లెట్ల సంఖ్య పెరిగేందుకు బొప్పాయి కూడా ఉపయోగపడుతుంది. నీటిలో కొన్ని బొప్పాయి ఆకులను వేసి మరిగించాలి. ఆ నీటిని తాగితే ప్లేట్లెట్ల వృద్ధికి సహకరిస్తుంది.  బొప్పాయి పండును తిన్నా ప్లేట్లెట్ల ఉత్పత్తికి మేలు జరుగుతుంది.

Photo: Unsplash

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు లాంటి బెర్రీలలో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటి తిన్నా ప్లేట్లెట్ల వృద్ధికి తోడ్పడతాయి. 

Photo: Unsplash

పాలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ కే ఉంటుంది. దీంతో వీటిని తీసుకున్నా ప్లేట్లెట్ల సంఖ్య పెరిగేందుకు తోడ్పడతాయి.

Photo: Unsplash

గుమ్మడి కాయలో విటమిన్ ఏ, ఐరన్, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకున్నా ప్లేట్లెట్ల వృద్ధికి ఉపకరిస్తుంది. 

Photo: Unsplash

దానిమ్మ పండు, బీట్‍రూట్‍లో యాంటీయాక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి కూడా రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరిగేందుకు ఉపయోగపడతాయి. 

Photo: Unsplash

బరువు తగ్గడాన్ని వేగవంతం చేసే 5 రకాల నట్స్ ఇవి

Photo: Pixabay