వర్కౌట్స్ తర్వాత మజిల్ రికవరీకి, ఎనర్జీ కోసం బెస్ట్ ఫుడ్స్ ఇవి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Apr 12, 2025
Hindustan Times Telugu
వర్కౌట్స్ (వ్యాయామాలు) చేసిన తర్వాత శరీరం ఒత్తిడికి గురైనట్టు నీరసంగా అనిపిస్తుంది. అందుకే అప్పుడు మిజిల్ రికవరీ కోసం, ఎనర్జీ వచ్చేందుకు కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. వ్యాయామాల తర్వాత తినేందుకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.
Photo: Pexels
అరటి పండ్లలో పొటాషియం, నేచురల్ షుగర్‌లతో పాటు మరిన్ని పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో వ్యాయామం తర్వాత ఈ పండును తినడం వల్ల శరీరానికి ఎనర్జీ మెరుగ్గా అందుతుంది. మజిల్ లాస్ రిస్క్ తగ్గుతుంది.
Photo: Pexels
కోడిగుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అమినో యాసిడ్స్ కూడా ఎక్కువే. అందుకే వర్కౌట్స్ తర్వాత మజిల్ మెరుగ్గా ఉండేందుకు గుడ్లు సహకరిస్తాయి. మంచి శక్తిని అందిస్తాయి.
Photo: Pexels
సాల్మన్, సార్డనైస్ లాంటి ఫ్యాటీ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు చాలా పోషకాలు ఉంటాయి. మజిల్ రికవరీకి ఇవి చాలా ఉపయోగపడతాయి.
Photo: Pexels
దానిమ్మలో పోలిఫెనోల్స్ సహా కీలకమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందుకే వర్కౌట్స్ తర్వాత దానిమ్మ తినడం, ఆ పండు జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.
Photo: Pexels
వ్యాయామాలు చేసిన తర్వాత గ్రీక్ యుగర్ట్, బెర్రీలను కలిపి తినడం కూడా మంచిది. గ్రీక్ యుగర్ట్‌లో ప్రోటీన్, బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మజిల్ లాస్‍ను తగ్గించటంతో పాటు ఇవి బాడీకి ఎనర్జీని బాగా అందించగలవు.
Photo: Pexels
పప్పులు, కాయధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వర్కౌట్స్ తర్వాత మజిల్ రికవరీ కోసం ఇవి తీసుకోవడం ఉపకరిస్తాయి.
Photo: Pexels
వర్కౌట్స్ తర్వాత పుచ్చకాయ తినడం కూడా చాలా మంచి ఆప్షన్. పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్ ఉంటాయి. శరీరానికి హైడ్రేషన్ బాగా అందిస్తుంది. ఎంతో కండరాలు, కణాలకు శక్తిని ఈ పండు కలుగజేస్తుంది.
Photo: Pexels
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అవి మానసిక అనారోగ్య సంకేతాలు