కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రకాల డ్రింక్స్

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Oct 26, 2024

Hindustan Times
Telugu

శరీరంలో ముఖ్యమైన క్రియలను కాలేయం (లివర్) నిర్వర్తిస్తుంది. ఆరోగ్యం బాగుండాలంటే కాలేయం మెరుగ్గా ఉండాలి. కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరచగల 5 రకాల డ్రింక్స్ ఏవో ఇక్కడ చూడండి.

Photo: Pexels

బీట్‍రూట్‍ జ్యూస్‍లో యాంటీఆక్సిడెంట్లతో పాటు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాలేయం పనితీరును ఇవి మెరుగుపరుస్తాయి. ఫ్యాటీ లివర్‌ను రిస్క్‌ను బీట్‍రూట్ తగ్గించగలదు. 

Photo: Pexels

కలబంద జ్యూస్ తాగడం వల్ల కాలేయానికి చాలా మేలు జరుగుతుంది. హానికరమైన టాక్సిక్స్ సులభంగా బయటికి పోయేందుకు, లివర్ క్లీన్‍గా ఉండేందుకు ఈ జ్యూస్ తోడ్పడుతుంది. 

Photo: Pexels

గ్రీన్ టీలో కటేచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కాలేయంలో మంటను, కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తుంది. లివర్‌కు మంచి చేస్తుంది.

Photo: Pexels

ఉసిరి జ్యూస్‍లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. వ్యర్థాలు తొలగిపోయేందుకు ఇది సహకరిస్తుంది. ఇందులోని విటమిన్ సీ కూడా కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. 

Photo: Pexels

నిమ్మరసంలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే నిమ్మరసం కలిపిన నీటిని తాగడం కాలేయానికి మేలు. కాలేయం శుభ్రంగా ఉండేందుకు ఈ డ్రింక్ సహకరిస్తుంది. 

Photo: Pexels

బ్లడ్ ప్రెజర్‌ను సహజంగా తగ్గించగల ఆరు రకాల ఫుడ్స్

Photo: Pexels