మనసును ప్రశాంతపరచుకోండి

ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతంగా ఉండటానికి 6 బెస్ట్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ 

PEXELS

By Ramya Sri Marka
Feb 23, 2025

Hindustan Times
Telugu

ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఒత్తిడి అనివార్యంగా మారిపోయింది. మీ మనసును శాంతపరచడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగించేందుకు బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ పాటించండి.

PEXELS, HEALTHLINE

ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతంగా ఉంచే బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్

PEXELS

డయాఫ్రాగమాటిక్ శ్వాస

కంఫర్ట్‌గా ఉండే విధంగా కూర్చోండి లేదా పడుకోండి. రెండు చేతులను ఛాతీ లేదా పొట్టపై ఉంచుకోండి. వీలైనంత ఎక్కువగా గాలి పీల్చుకోండి. నెమ్మదిగా 1-2 నిమిషాల పాటు బయటకు వదలండి.

PINTEREST

బాక్స్ శ్వాస

4 సెకన్ల పాటు గాలి పీల్చుకోండి. 4 సెకన్లు బయటకు వదలకుండా ఉండండి.  4 సెకన్ల పాటు బయటకు వదలండి. విశ్రాంతి, ఫోకస్ మెరుగవడం కోసం కొద్ది నిమిషాల పాటు రిపీట్ చేస్తూ ఉండండి. 

PINTEREST

4-7-8 శ్వాస

4 సెకన్ల పాటు ముక్కు ద్వారా గాలి పీల్చుకోండి. 7 సెకన్లు గాలి బయటకు వదలకండి. 8 సెకన్ల పాటు నోటి ద్వారా బయటకు వదలండి. విశ్రాంతి కోసం రిపీట్ చేస్తుండండి.

PINTEREST

ప్రత్యామ్నాయ శ్వాస

కుడి నాసికా రంధ్రాన్ని మూసివేసి, ఎడమ నాసికా రంధ్రంతో గాలి పీల్చుకోండి. ఆ తర్వాత ఎడమ వైపు మూసివేసి, కుడి వైపు నుంచి బయటకు వదులుకోండి. మానసికంగా క్లారిటీ పెరగడం కోసం 5-10 నిమిషాల పాటు రిపీట్ చేయండి.

PINTEREST

రెసోనెంట్ శ్వాస

5 సెకన్ల పాటు గాలి పీల్చుకోండి. 5 సెకన్ల పాటు బయటకు వదులుకోం. హార్ట్ బీట్ రేటును నియంత్రించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి రిపీట్ చేస్తూ ఉండండి.

PINTEREST

పర్స్డ్-లిప్ శ్వాస

ముక్కు ద్వారా లోతుగా గాలి పీల్చుకోండి, ఆపై విశ్రాంతిని పెంచడానికి పెదవులను బిగబట్టి నెమ్మదిగా బయటకు వదలండి.

PINTEREST

వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.  

pexels