మీ కంటిచూపు మందగించిందా? ఈరోజు నుంచే ఈ ఐదింటిని తినడం ప్రారంభించండి!

Pixabay

By Sanjiv Kumar
Mar 21, 2025

Hindustan Times
Telugu

డిజిటల్ యుగంలో ప్రజల కళ్లు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. పెద్దలకే కాదు పిల్లలకు కూడా కళ్లద్దాలు ధరించే పరిస్థితి పెరుగుతోంది.

Pexels

మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా కంటి చూపు మసకబారిన, మందగించిన ఈ 5 డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల సహజమైన పద్ధతిలో కంటి చూపు మెరుగుపడుతుంది.

Pexels

బాదంలోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కళ్లలో తేమను నిలుపుకోవటానికి, డ్రై ఐ సిండ్రోమ్ నుండి రక్షించడానికి సహాయపడతాయి.

Pexels

పిస్తా పప్పు హానికరమైన కాంతి తరంగాల నుంచి రక్షిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే, కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు.

Pexels

జీడిపప్పు రుచికరమైనది మాత్రమే కాదు, రెటీనా ఆరోగ్యానికి అవసరమైన జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుందని చెబుతారు.

Pexels

వాల్ నట్స్ కంటి కణ పొర నిర్మాణం, నిర్వహణకు తోడ్పడతాయి. కళ్ల మంటను తగ్గిస్తాయి, అలాగే, కళ్లలో రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తాయి.

Pexels

కర్జూరం (డేట్స్) ఆరోగ్యకరమైన దృష్టిని పెంపొందేలా చేస్తుంది. రేచీకటిని నివారిస్తుందని,  కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు.

Pexels

అలియా భట్ నుంచి కత్రినా కైఫ్ వరకు: బాలీవుడ్ భామలను అందమైన పురుషులుగా మార్చిన ఏఐ

Photo Credit: Instagram/@ai.meme.nation