మార్కెట్‌లో చేపలు కొంటున్నారా? అవి ఫ్రెష్‌వో కాదో ఈ 4 చిట్కాలతో తెలుసుకోండి!

Canva

By Sanjiv Kumar
Mar 24, 2025

Hindustan Times
Telugu

మార్కెట్‌లో అని రకాల చేపలను అమ్ముతుంటారు. అయితే, వాటిలో నుంచి తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలో ప్రముఖ చెఫ్ అజయ్ చోప్రా చెప్పిన ఈ నాలుగు సింపుల్ చిట్కాలతో తెలుసుకోండి.

Pixabay

చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది. మాంసాహారులు తరచుగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వంటి అవసరమైన ప్రొటీన్ల కోసం చేపలను తింటారు.

Pixabay

కానీ, మీరు మార్కెట్ నుంచి చేపలను కొనుగోలు చేసినప్పుడల్లా, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే నిర్లక్ష్యంతో ఉంటే పాత, పాడైన చేపలను కొని ఇంటికి తీసుకువెళ్లాల్సి వస్తుంది. 

Pixabay

మార్కెట్‌లో మీరు కూడా చేపలు కొనేటప్పుడు తరచుగా మోసపోతుంటే.. ప్రముఖ చెఫ్ అజయ్ చోప్రా అందించిన ఈ నాలుగు సింపుల్ చిట్కాలను తెలుసుకోండి. దీని సహాయంతో తాజా చేపలను కొనడం మీకు సులభం అవుతుంది.

Pixabay

చేపను కొనేటప్పుడు ఒక చేత్తో దాని చర్మంపై నొక్కండి. మీరు దాని చర్మాన్ని నొక్కితే అది గట్టిగా ఉంటే ఆ ఫిష్ చెడిపోయిందని అర్థం. అదే పైభాగం మళ్లీ పైకి లేస్తే తాజా చేపలకు సంకేతం.

Pexels

చేపలు కొనుగోలు చేసేటప్పుడు, దాని కళ్లపై శ్రద్ధ వహించండి. చేపల కళ్లు మృదువుగా, మెరిసిపోతుంటే అవి తాజాగా ఉన్నాయని అర్థం. లేత రంగులో ఉంటే చేప పాతదని తెలుసుకోండి.

Pexels

చేపలు కొంటున్నప్పుడు మెడ దగ్గర మచ్చలు పూర్తిగా గులాబీ లేదా ఎరుపు రంగులో ఉండాలని గుర్తుంచుకోండి. ఈ ప్రాంతం నలుపు, మెరూన్ లేదా ముదురు రంగులో కనిపిస్తే అవి పాతవని అర్థం.

Pixabay

సాధారణంగా దుకాణదారులు చేపను ఎత్తడానికి అనుమతించరు. కానీ, చేపను పట్టుకునేటప్పుడు అది పూర్తిగా వేలాడుతూ లేదా చాలా వదులుగా కనిపిస్తే అది పాత చేప. తాజా చేపలు వదులుగా ఉండవు. ఎత్తినప్పుడు గట్టిగా ఉంటాయి.

Pixabay

బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!

Photo: Pexels