రాత్రి భోజనం (డిన్నర్) చేసిన తర్వాత కచ్చితంగా నడవాలని వైద్య నిపుణులు చెబుతారు. జీర్ణక్రియ నుంచి మంచి నిద్ర వరకు దీని వల్ల ప్రయోజనాలు ఉంటాయి.
Photo: Pexels
డిన్నర్ తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు నడవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.
Photo: Pexels
రాత్రి భోజనం తిన్న తర్వాత నడవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. కండరాలకు మేలు జరుగుతుంది.
Photo: Pexels
రాత్రి వేళ జీర్ణవ్యవస్థ మందకొడిగా ఉంటుంది. కానీ, డిన్నర్ తర్వాత నడవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అజీర్తి సమస్య తలెత్తదు.
Photo: Pexels
కొన్నిసార్లు ఒత్తిడి వల్ల రాత్రివేళ సరిగా నిద్ర పట్టదు. అయితే రాత్రి తిన్న తర్వాత నడవడం.. ఒత్తిడి తగ్గేందుకు సహకరిస్తుంది. మంచి నిద్ర పట్టేందుకు ఉపయోగపడుతుంది.
Photo: Pexels
రాత్రి తిన్న తర్వాత నడవడం వల్ల బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారు డిన్నర్ తర్వాత నడవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, మూత్రమండలం, మూత్రనాళ వ్యాధులు గుర్తించడం ఎలా?