జుట్టుకు సీరం వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Sep 04, 2024

Hindustan Times
Telugu

జుట్టుకు హెయిర్ సీరం రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. హెయిర్ వాష్ తర్వాత సీరం‍ను ఉపయోగించాలి. హెయిర్ సీరం వాడడం వల్ల జుట్టుకు కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే. 

Photo: Pexels

జుట్టుకు హెయిర్ సీరం అదనపు మెరుపు ఇస్తుంది. జుట్టు టెక్స్‌చర్ మెరుగ్గా ఉండి.. ఎక్కువ షైనీగా కనిపిస్తుంది. 

Photo: Pexels

జుట్టు పొడిబారకుండా సీరం చేయగలదు. తేమను లాక్ చేసి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. 

Photo: Pexels

కాలుష్యం, ఎండ, దుమ్ము వల్ల జుట్టుకు జరిగే డ్యామేజ్‍ను హెయిర్ సీరం తగ్గించగలదు. సీరం రాసుకోవడం వల్ల వీటి నుంచి వెంట్రుకలకు కాస్త రక్షణ లభిస్తుంది.

Photo: Pexels

జుట్టు చిక్కులు పడకుండా సీరం చేయగలదు. స్మూత్‍గా ఉండేలా చేస్తోంది. దీనివల్ల వెంట్రుకలను దువ్వుకునేందకు సులువుగా ఉంటుంది. ఎక్కువగా జుట్టు రాలదు. 

Photo: Pexels

జుట్టుకు సీరం పోషకాలను అందిస్తుంది. ఫాలిసిల్స్, కుదుళ్లకు కూడా మేలు చేస్తోంది. ఓవరాల్‍గా జుట్టు మెరుగ్గా ఉండేందుకు తోడ్పడుంది.

Photo: Pexels

స్కిన్ కలర్ డ్రెస్సులో సెగలు రేపిన బ్రో హీరోయిన్ కేతిక శర్మ 

Instagram