కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
Unsplash
By Anand Sai Jul 14, 2024
Hindustan Times Telugu
కొత్తిమీర జ్యూస్‌ని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
Unsplash
కొత్తిమీర రసం తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. కొత్తిమీర మీ రక్తంలో చక్కెరను తగ్గించడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సాయపడుతుంది.
Unsplash
గుండె, మెదడు, చర్మం, కాలేయం, ఎముకలు, రక్తం గడ్డకట్టడం, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కొత్తిమీర సహాయపడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
Unsplash
ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. కొత్తిమీర ఆకులను ఖాళీ కడుపుతో తీసుకుంటే కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
Unsplash
కొత్తిమీర రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలతో పాటు అన్ని రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చు.
Unsplash
కొత్తిమీర రసం తయారుచేసే ముందు కొత్తిమీర ఆకులను బాగా కడగాలి. తరువాత కత్తితో కత్తిరించండి. అవసరం మేరకు నీళ్లు పోసి రుబ్బుకోవాలి.
Unsplash
రసాన్ని ఒక పాత్రలో తీసుకుని వడకట్టాలి. అందులో కాస్త నిమ్మరసం, కావాలంటే తేనె కలపండి. అయితే కొత్తిమీర రసం అతిగా తాగకూడదు. కొత్తిమీర తక్కువ వేసి.. నీరు ఎక్కువగా పోసుకోండి.
Unsplash
నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనుల కారణంగా సరైన నిద్రపట్టకపోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతిని ఆ తర్వాత రోజుపై ప్రభావం పడుతుంది. పడుకునే ముందు చేయకూడని 8 పనులేంటో చూద్దాం.